పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కథలు - గాథలు

మన ఆచార వ్యవహారాలనే అవలంబించి యున్నారు. వేషభాషలలో ఘూర్జర దేశంలో నున్న హిందువులకూ వీరికీ తేడా లేదు. రాజపుత్ర స్థానంలోని ముసల్మాను లందరూ మొగలాయి చక్రవర్తుల కాలంలో మహమ్మదీయులైన రాజపుత్రుల సంతతివారే. తక్కినవారిలో చాలా మంది మియోలు వీరుకూడా హిందువులలోనుంచి ముసల్మాను లైన వారే. పశ్చిమోత్తర పరగణాలలో నున్న ముసల్మానులలో కూడా విజాతీయరక్తము బహుస్వల్పముగా నున్నది. దక్షిణ హిందూస్థానంలో మలబారులోని మాపలాలు క్రీస్తుశకము ఎనిమిదవశతాబ్దములో అరబ్బీదేశాన్నుంచి మనదేశంతో వర్తకవ్యాపారం చేస్తూవచ్చిన అరబ్బీదేశీయులకును, మలబారు హిందువులలోని కిందితరగతుల స్త్రీలకును పుట్టినవారేగాని విజాతీయులుగారు.

మహమ్మదీయులు ప్రబలంగా నున్న పంజాబురాష్ట్రంలో కూడా నూటికి 16 వంతులు మాత్రమే పఠాను బెలూచీ మొగలు వగైరా విజాతీయులు సంతతి వారనిన్నీ, మిగతా 84 వంతులూ హిందువులలోనుంచి మహమ్మదీయులైనవారి సంతతి వారే ననిన్నీ 1901 వ సంవత్సరపు జనాభాలెక్క వల్ల తేలినది. 1901 లో పంజాబులోనున్న మహమ్మదీయులు 1, 4, 40, 122 మందిలో జాటులనే తెగవారు 20 లక్షలు; రాజపుత్రులు ఆరెయినులు 10 లక్షలు; జోలా, అవాను , గుజారు, ముచీ, కుంహరు తర్ఖాను, తేలీలు ఒక్కొక్క తెగవారు ఏడులక్షల యాబైవేల మందిమొదలు 10 లక్షల దాకా వున్నారు. వీరందరు హిందువుల సంతతివారే.

మనదేశపు ముసల్మానులలో హిందువుల లాగనే ఒకరితో ఒకరికి సంబంధబాంధవ్యములు లేని షియాలు, సున్నీలు అనే రెండు పెద్దతెగలు నున్నవి. వీరుగాక ప్రత్యేక తెగలుగా నున్న సయ్యదులు, షేకులు, పఠానులు, మొగలులు, మొహమ్మదీయులు, రాజపుత్రులు, జాటులు, గుజారులు, మియోలు, డిష్కానీలు, మోసలాలు మొదలైన వారున్నారు. ఈ ముసల్మానులలో మెమను, బోరా, ఖోజా, జూలా, ధానియా, ఘోసీ, కుంజెరు, మనిహరు, కసాయీలు మొద