జగద్గురు తత్త్వబోధకస్వామి
67
నివ్వడము, అనేక సందర్భలలో స్నానాలు చెయ్యనివ్వడము, ఇంకా హిందూవర్ణాశ్రమధర్మాలయందు ఆదినుంచీ జరుగుతూ వస్తూవున్న ఆచారములను అవలంబించ నివ్వడము - ఇవిక్రైస్తవమత ధర్మాలకు విరుద్ధమని నిందించారు..
పైన చెప్పిన విధంగా నోబిలీగారు 5 సంవత్సరాలు ప్రచారంచేసి క్రైస్తవమతం వ్యాపిస్తూవున్న స్ధితిలో పైయధికారులు ఆయన చేసే ప్రచార విధానాన్ని నిషేధించారు. అతణ్ణి కొన్నాళ్లు పని మాన్పించి తరువాత తక్కిన ఫాదరీలలాగనే ప్రచారం చెయ్యమన్నారు. నోబిలీ పడిన కష్టమంతా వృధాఅయింది. క్రైస్తవమత ప్రచారకులు ఈ కొత్త భేషజాలు మాని పూర్వపద్దతుల తోనే ప్రవర్తించడం ప్రారంభించారు. మళ్ళీ వీరిని పరంగీలని నీచంగా చూడడం ప్రారంభమైనది. ముద్దువీరప్ప నాయనిరాజ్యకాలంలో పరిపాలన నిరంకుశంగా జరిగిందని జెస్సూట్లు వ్రాశారు.
ఉ ప సం హా రం
ముద్దువీరప్ప తరువాత మహారాజమాన్య రాజశ్రీ తిరుమలశౌరినాయన అయ్యలుగారు మధుర రాజ్యానికి రాజైనాడు. ఆయన పట్టాభిషేకము 1924 లో జరిగినట్లు కనబడుతూవుంది. ఈ తిరుమలనాయకుడు విజయనగర సామ్రాజ్యం లోనుంచి విడిపోయి స్వతంత్రుడై పరిపాలింపసాగాడు. దేశం శాతంగానూ, సుభిక్షంగానూ వున్నది. ఈ సరికి రోమునగర క్రైస్తవాధికారులు తమపట్ల కొంతశాంతించి యుంటారని రాబర్టో డీ నోబిలీగారు ఊహించి 1923 లో తన పాతపద్దతిలో మళ్ళీ క్రైస్తవమతప్రచారం చెయ్యడానికి పూనుకొని మధురనుండి బైలుదేరాడు. ఇతడు మొదట తిరుచునాపల్లి, శండమంగలము, సేలము మొదలైన ప్రాంతాలకు బోయి కొందరిని మతంలో కలిపాడు.
మధురలో క్రైస్తవమతాన్ని వ్యాపింపచెయ్యడానికి బ్రాహ్మణులు ఆటంకాలు కలిగించడం ప్రారంభించారు. మధుర సనాతన ధర్మానికి దుర్గంగావున్నందువల్ల అతడు మెల్లిగా తిరుచునాపల్లి మొదలైన