పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

66

కథలు - గాథలు

నోబిలీ కట్టిన క్రైస్తవ దేవాలయంస్థలం తనదని మధుర దేవాలయం ప్రధాన అర్చకుడు తగాదాపెట్టినాడు. అంతట ఈనోబిలీగారి క్రైస్తవ ప్రచారానికి వ్యతిరేక ప్రచారం ప్రారంభమైనది. హెర్మేకత్తియనే శ్రీమంతు డొకడు నోబిలీగారికి సహాయ పడినందువల్ల అప్పటికి నోబిలీ గారి క్రైస్తవదేవాలయానికి ఆపద తప్పింది. ఈ హెర్మెకత్తి క్రైస్తవమతంలో కలియకపోయినా నోబిలీగారికి ప్రాపకుడుగా వుండేవాడు. ఇంతలో నోబిలీగారికి ఇంకొక తవాయి వచ్చింది. దానివల్ల ఆయన మతప్రచారం కట్టిపెట్టవలసివచ్చింది.

ఆ శ్వా సాం తం

ఇదివరలో మధురానగరంలో క్రైస్తవమత ప్రచారకునిగా ఉన్న ఫర్నాండజ్ గారికి ఈనోబిలీగారు అవలంబించే ప్రచారపద్ధతులు, చర్యలు క్రైస్తవధ్రర్మాలకు విరుద్ధంగా వున్నట్లు తోచింది. నోబిలీగారి కొన్ని చర్యలు చాలా అసహ్యకరంగ తోచి మందలించినా గాని లాభం లేకపోయింది. అంతట పైయధికారులకు ఈ చర్యలన్నీ వివరించి చెప్పడంవల్ల నోబిలీగారి ప్రవర్తన బాగాలేదని పైఅధికారులన్నారు. గోవానగరంలో ఉన్న పోర్చుగీసు క్రైస్తవమతాధికారులకు నోబిలీమీద ఈర్హ్యాభావముకూడా కలిగింది. క్రైస్తవమతంలో కలిసిన హిందువులు తమ పూర్వపు మతాచారాలన్ని అవలంబించవచ్చు నని నోబిలీగారు అనుజ్ఞ యిచ్చినందువల్ల క్రైస్తవమతం దురాచారాలకు పుట్టినిల్లుగా మారినదనిన్ని, ఈమతాన్నిగురించి ప్రపంచములో చాలా అపఖ్యాతి కలిగినదనిన్ని వారన్నారు. (1)ముఖ్యంగా నోబిలీగారు హిందూస్వాములవారిలాగ 'జగద్గురువు ' అనే బిరుదును తాల్చడము, (2) తాను పరంగిని కానని చెప్పి నటించడము (3) హిందువుల మూఢవిశ్వాసములను సూచించే పరిభాషను వేదాంతసూత్రము లను, మాటలను వుపయోగించడము, (4)తనమాటలు విశ్వసించి క్రైస్తవమతంలోకలిసిన హిందువులనువారు పూర్వాచారం ప్రకారం వుంచుకునే జుట్టుపిలకలను వుంచుకొనివ్వడము, జందెములు వుంచుకోనివ్వడము, ముఖముమీద గంధాక్షితలు మొదలైన బొట్లు పెట్టుకో