పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

కథలు - గాథలు

స్వంతకవిత్వంలోనుంచీ శ్లోకాలు, పద్యాలూ, కధలూ, గాధలు, వివరిస్తూ దీర్ఘమైన ఉపన్యాసం చేసేవాడు. మంచి విచక్షణ జ్ఞానంతో తప్పులు వెదకడానికి నడుము కట్టుకుని కూర్చున్న వారున్న సభలలో ఈవిదేశీయు డొక సంవత్సరలోనే దేశభాష నభ్యసించి తనపాండిత్యానికీ, భాషాజ్ఞానానికీ సభవారు ఆశ్చర్య పడేటట్లుగా ఇంత జయప్రదంగానూ, అనర్గళంగానూ ఉపన్యసించ గలిగాడంటే అతడు గొప్ప ప్రతిభాశాలి అనకతీరదని ఒక గ్రంధకర్త వ్రాశాడు.

భూ త వై ద్యం

నోబిలీగారున్నూ, ఆయన శిష్యులున్నూ ఏసుక్రీస్తు శిలువను రక్షరేకుగాను, క్రైస్తవపూజలోని పవిత్రోదకాన్ని మంత్రతీర్ధం గానూ వుపయోగించి జబ్బుపడినవారికి భూతవైద్యం చేసి కుదిర్చే తంత్రం ఒకటి ప్రారంభించాడు. 1907 లో ఒక ఆడమనిషికిన్ని, 1908 లో ఒక మహమ్మదీయునికిన్ని ఇలాగ దయ్యం వదలి పోయిం దనిన్ని ఫాదరీల ఉత్తర ప్రత్యుత్తరలలో వ్రాయబడియున్నది. ఒక మాటు ఈ నోబిలీ యేలాటి వాడని ఒక దయ్యాన్ని ఆయన శిష్యుడు అడుగగా అతడు చాలా శక్తులు గలవాడనిన్ని, ఆయన బోధించే ధర్మాలన్నీ నిజమైన వనిన్ని దయ్యం చెప్పినదట. ఈయన దలపెట్టిన కార్యానికి మొదట విఘ్నాలు కలుగుతా యనిన్ని, మూడేళ్లలో జయం కలుగుతుం దనిన్నీ కూడా చెప్పిందట. ఇలాగ భూతవైద్య తంత్రాలు జరపడంవల్ల మధురానగరంలో ప్రజలలో నమ్మకం కుదిరి నోబిలీగారి ప్రభావాన్ని గురించి విపరీతంగా చెప్పుకోవడం ప్రారంభించారు. మధుర రాజసభలోకూడా ఆయన ఖ్యాతి పాకింది. అనేకులైన ప్రభువులు ఆయనతో స్నేహం చెయ్యడం ప్రారంభించారు.

ఫ లి తా లు

ఇలాగ వేషధారణ చేసి కపట నాటకమార్గం ద్వారా ఏసుక్రీస్తుసేవ చేసే పద్ధతి త్వరలోనె ఫలప్రదమైనది. ఈనోబిలీ తన జీవిత