జగద్గురు తత్త్వబోధకస్వామి
63
"ఈ మతధర్మాన్ని స్వీకరించే వారెవ్వరూ తమ కులాచారాలను వదులుకో నక్కరలేదు. ఇంకొక కులంలో చేరనక్కర లేదు. తనకులాచారాలకు విరుద్దమైన ఏపనినీ చేయనక్కరలేదు. భగవంతుని సాక్షిగా ఈ పవిత్ర మతధర్మము అన్ని వర్ణాలకూ అర్హమైనది. బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన ప్రజలందరు లౌకిక వ్యవహారాలలో ఈ దేశపు రాజైన మహానాయకుడి శాసనానికి ఎలా లోబడివుంటారో అధ్యాత్మిక విషయాలలో మానవులందరికి ప్రభువైన భగవంతుని ధర్మశాసనానికి అన్ని కులాలవారూ, అన్ని తరగతులవారూ లోబడివుండాని. ఈ దేశంలో పూర్వపు ఋషులు, సన్యాసులు చెప్పే ధర్మాలనే నేను కూడా చెప్పుతున్నాను. ఈ ధర్మాలు కేవలమూ అస్పృశ్యులకూ, పరంగీలకూ అర్హమైనవని ఎవరయినా అంటే వారు మహాపాతకం చేస్తున్నారన్నమాట. అన్ని కులాల మనుష్యులకూ భగవంతుడు ప్రభువు గనుక ఆయన ధర్మాన్ని అందరూ శిరసావహించాలి. ఈధర్మానికి లోబడినందువల్ల ఇంకను ఉన్నతమైన స్థితిని చెందని ఉన్నత కులములేదు. తన పవిత్రతను అవంతయైనాతగ్గకుండా ప్రపంచంలోని అన్ని కులాలమీదను, వస్తువులమీదను, సూర్యరశ్మి యెలా ప్రసరిస్తుందో అని బ్రాహ్మణులను అపవిత్ర పరచకుండా ఎలాగ తేజస్సు నిస్తున్నదో ఈ అధ్యాత్మికసూర్యరశ్మి కూడా మనుషులందరికీ తన పవిత్ర ధర్మాన్ని, పవిత్ర తేజాన్ని ప్రసాదిస్తుంది/." అని నోబిలీ ఉద్భోధించేవాడు.
ఉ ప న్యా స ధో ర ణి
నోబిలీ చేసే ఉపన్యాస పద్ధతికూడా చాలా చిత్రంగానూ, దేశీయంగానూ వుండి శ్రోతల మనస్సులకూ, హృదయాలకూ బాగా నాటేటట్లు వుండేది. నోబిలీ తాను స్వయంగా చక్కని పద్యాల నెన్నోరచించి వాటిని శ్రావ్యంగా చదివేవాడు. ఈ దేశంలో మతధర్మాలను, పురాణాలను చెప్పేవారి పద్దతిలో ముందుగా తాను చెప్ప దలచిన మతధర్మాన్ని గురించి భావగర్భితమైన ఒక సూత్రాన్ని చెప్పి దానికి వ్యాఖ్యానం చెప్పడంలో అనేక గ్రంధాలలో నుంచి తన