58
కథలు గాథలు
రహస్యాలను ఆయన నాకు చెప్పారు. వేదాలను వ్రాయడం మహాపాతక మని బ్రాహ్కణుల వూహ. దానిని ఎంతో కష్టపడి పదిపన్నెండేండ్లు పాఠము చెప్పించుకుని కంఠస్థము చేస్తారు. ఈ విషయంలో నా గురువు తన శంకలను మాని ఆ సూత్రాల నన్నింటినీ నాకోసం వ్రాసిపెట్టాడు. అయితే ఇది చాలారహస్యం గా చెయ్యాలి. ఈ సంగతి ఇతర బ్రాహ్మణులకు తెలిస్తే వాళ్లు ఆయను గ్రుడ్లు పీకుతారు. ఇది నేర్చేటందుకు ప్రాణభయానికి కూడా తెగించాలి. ఎందువల్లనంటే హిందువులను క్రైస్తవమతంలో కలపాలంటే ఈరహస్యాలు తెలియడం చాలా అవసరం." ఈ విద్యను అభ్యసించడంలో నోబిలీ అమితమైన పట్టుదలతో పనిచేశాడు. ఆఖరుకు క్షవరం చేయించుకుంటూ వున్నప్పుడుకూడా పాఠాలు చదువుతూనె వుండేవాడు.
1908 లో నోబిలీని గురించి ఒకడు వ్రాసిన దానిలో ఇలావుంది. "అతడు సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే అతడు ఆభాషను చదవడమూ, మాట్లాడడమూ కొంతవరకు నేర్చుకొన్నాడు." రెండేళ్ల తరువాత 1910 డెశంబరు 8 వ తేదీన ఆ భాషను నోబిలీ బాగా అర్ధం చేసుకోగలుగుతున్నా డనిన్నీ, ధారాళంగా మాట్లాడుతున్నా డనిన్నీ లెయిర్జియో వ్రాశాడు. నోబిలీ మూడుభాషలను బాగా నేర్చుకున్నాడనిన్నీ, మతాంతరులైన హిందూదేశీయుల మతరహస్యాల నన్నిటినీ బాగా గ్రహించాడనిన్నీ, రాష్ట్రీయాధికారియైన రోస్ గారు 1913 లో వ్రాశారు. ఈ భాషలను కొంతవరకు అభ్యసించిన ఆర్చిబిషప్పుగారు కూడా నోబిలీయొక్క శక్తిసామర్ధ్యాలనూ, పాండిత్యాన్నీ చూచి ఆశ్వర్యపడ్డారు.
భే ష జ ము - ప టా టో ప ము
ఈ తత్వవేత్తచుట్టూ ప్రజలు గుమిగూడడం ప్రారంభమైనది. కొంద రీయనను గొప్పవాడని పొగడడం ప్రారంబించారు. ఈయనను చూడాలనీ, ఈయన చెప్పే సంగతులు వినాలనీ కొందరు ఈయన