పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగద్గురు తత్త్వబోధకస్వామి

57

వుంటుందో ఊహించండి. అన్నం వర్జించడానికి నేను సాహసించ లేదు. ఇప్పుడు నేను పెట్టుకున్న నియమాలే, అనగా మాంసము, చేపలు, గ్రుడ్లు వర్జించడమే నేను నిజమైన మతాచార్యుడ నని ప్రజలు అనుకునేటందుకు చాలును. ఈ వుత్తరం వ్రాస్తూవున్న సమయంలో నేను ఉబ్బసం దగ్గువల్ల వూపిరి ఆడక బాధపడుతున్నాను. అందువల్ల దీనిని మెల్లమల్లగవ్రాస్తున్నాను."

నోబిలీ ఒక బ్రాహ్మణవంటవాడిని పెట్టుకున్నాడు. శూద్రుని చేతి అన్నం తినడానికి సాహసించేవాడుకాదు. సన్యాసులందరిలాగనే అతడు మధ్యాహ్నం నాలుగు గంటలవేళ వంటిపూట భోజనం చేసేవాడు. దినమంతా అతడు దేశ భాషలను చదవను వ్రాయను నేర్చుకునేవాడు. అతడు ఈ దేశానికి రాగానే కొచ్చినులోనే అరవం నేర్చుకొవడం ఆరంభించాడు. ఆరునెలలు ఇతరులతో మాట్లాడేశక్తి సంపాదించాడు. రెండేళ్లలో (1909 లో) అతడు మళ్లీ తన దేశానికి వ్రాస్తూ అరవంలో మాట్లాడడంకంటె ఇటాలియను పోర్చుగీసు భాషలలో మాట్లాడడమే ఇప్పుడు తనకు కష్టముగా వున్నదని వ్రాశాడు. ఈ అరవభాష చాలా గొప్పదనిన్నీ, అందమైన దనిన్నీ కూడా వ్రాశాడు. అతడు తమిళ గ్రంధకర్తలలోనుంచి పద్యాలు చదువుతూ కధలు వుదాహరిస్తూ గ్రాంధికమైన అరవాన్ని చక్కగా మాట్లాడే వాడని 1608 లో ఆయన తోడి మతాచార్యుడొకడు వ్రాశాడు.

అరవం బాగా వచ్చిన తరువాత నోబిలీ తెలుగును, సంస్కృతమును నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇంతవరకూ తెల్లవారెవరూ తెలుగు బాగానేర్చుకోలేదు. మధురవాస్తవ్యుడైన ఒక బ్రాహ్మణపండితుడు నోబిలీకి ఈ భాషలు నేర్పడానికి కుదిరాడు. 1609 ఏప్రిలు 22 వ తేదీన రాష్ట్రీయాధికారికి నోబిలీ వ్రాసిన ఉత్తరంలో తన పంతులు వారిని గురించి ఇలాగ వ్రాశాడు. "ఈ సద్భ్రాహ్మణుడు నాకు చేసే ఉపకారానికి తగినట్లుగా నాకృతజ్ఞతను తెల్పజాలను. ఆయనవల్ల నేను సంస్కృతము, తెలుగు నేర్చుకొనడమే గాక అంతకన్న అమూల్యమైన విషయాలను ఆయనవల్ల తెలుసుకో గలిగాను. వేదాల