56
కథలు - గాధలు
1907 డిశంబరు 1 వ తేదీన కార్దినల్ బెల్లార్మినోగారికి నోబిలీ వ్రాసిన రహస్య లేఖలో అతడు ఇలాగ అన్నాడు. "ఇప్పుడు నేను చుట్టూ మట్టిగోడలుగల పూరి పాకలో వాసంచేస్తున్నాను. దివ్యసౌధంకంటె నాకిదే ఆనందకరంగా వుంది. ఈశ్వరసేవకోసం ఈవిధంగా దేశాంతరంలో ఏకాంతవాసం చెయ్యడంలో వుండే మానసికశాంతి ఇంకొకదానిలో లేదు. అయినా నేను పూనిన ఈదీక్షలోవుండే శ్రమ ఒక్కొక్కపుడు చాలా భాధాకరంగావుంటున్నది. నాయవజ్జీవము ఇలాగ శ్రమపడాలేమోననే ఆలోచనవల్ల, చివరదాకా నిగ్రహించలేనేమోనని ఒక్కొక్కపుడు అధైర్యం కలుగుతూవుంటుంది. నానిత్య జీవితం ఇలాగ జరుగుతూఫుంది:- ప్రొద్దున్ననుంచి సాయంత్రం దాకా ఎక్కడికీ కదలకుండా నేను నా యింట్లోనే కాలక్షేపం చేస్తూ వుంటాను. నాతో ఎవరైనా మాట్లాడడానికిగానీ, చర్చించడానికిగాని వస్తే నేను ఈశ్వరప్రార్ధనము చేసినతరువాత వాళ్లకు దర్శనమిస్తాను. దేశీయులలో ప్రబలియున్న పొరబాటు మతసిద్ధాంతాలను ఖండిస్తూ దేశభాషలో వ్రాసేటందుకు మిగతా కొద్దికాలాన్ని వినియోగిస్తూ వుంటాను. నేను ఎల్లప్పుడూ నాయింటిలోని చిన్న గదిలోనే కాలక్షేపం చేస్తూవున్నందువల్లనూ, మాంసముగాని కోడిగ్రుడ్లుగాని నాగడపలోకి రావడానికి వీలులేదని నేను నిషేధించినందువల్లను, నేనుతినేఆహారము నాకు తగిన బలము నివ్వనందువల్లనూ, నాకు ఎప్పుడూ ఏదో జబ్బుగానే వుంటూవున్నది. నాకడుపులోనో, తలలోనో నొప్పిలేకుండా వున్నరోజులు బహుతక్కువ. నేను తినే ఆహారము వరిఅన్నమూ, కూరగాయలూ, పళ్ళూను. నేను ఇవితప్ప ఇంకొకటి తినకూడదు. ఈ దేశంలో తత్వబోధ చేసే మతాచార్యులూ, సన్యాసులూ ఇంకా కఠినమైన యమ నియమాలతో జీవిస్తారు. ఒక్కమెతుకు అన్నమైనా తినని వాళ్లుకూడా వున్నారు. ఈ దేశప్రజలు నానురొట్టె తినడం ఎరగనే ఎరగరు. ఇక మద్యం అనగా సారాయమును 'మాస్ ' అనే క్రైస్తవప్రార్ధన నిమిత్తమాత్రమే నేేను వుపయోగిస్తున్నాను. అన్నంకూడా వర్జిస్తే ఇక మనిషి తినే ఆహారం ఎంత స్వల్పంగా