Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కథలు - గాథలు

రాబర్టోడీ నోబిలీ తన ఉద్దేశ్యాలను ఆచరణలో పెట్టేటందుకు ముందు పైవారితో ఆలోచించాడు. రాష్ట్రీ య మతాధికారియైన లెయిర్జియో, నోబిలీ వేసిన పధకాన్ని మనస్పూర్తిగా అంగీకరించాడు. ఆయనపై యధికారియైన క్రాంగనూరు ఆర్చిబిషప్పు ఫ్రాన్సిస్కోరోన్ గారితోకూడా నోబిలీగారు ఆలొచించి వారి అంగీకారాన్ని పొందినాడు. ఇద్దరూ కలసి ఒక కార్యాచరణ పద్ధతిని నిర్ణయించారు. ఆర్చిబిషప్పుగారు కూడా హిందువుల విగ్రహారాధనను గురించీ మతధర్మాలను గురించీ, వ్రాయబడిన పుస్తకాలను కొన్నింటిని ముందుగా చదివారు. తరువాత మలబారు తీరాన్ని, ఉన్నరోమన్ క్యాతలిక్క క్రైస్తవమత ప్రచారకులలో ప్రజ్ఞావంతులైన విద్వాంసులతోను, పోర్చుగల్లు దేశంలోవున్న మతాచార్యులతోనూ కూడా ఆలోచించారు. అందరూకూడా వీరి అభిప్రాయాలతో నేకీభవించారు. ఆందువల్ల ఈ ఆర్చిబిషప్పుగారు కూడా నోబిలీగారికి ఈ విషయంలో తమ అంగీకారము ను తెలిపారు.

బ్రాహ్మణులు ధరించే శిఖాయజ్ఞోపవీతములు, అనగా జుట్టు ముడిన్నీ, జందెములున్నూ, వారు పెట్టుకునే గంధాక్షతాల, బొట్టున్నూ, వారు అవలంబించే ఇతరాచారాలున్నూ వారి మతసంప్రదాయాలకు సంబందించిన చిహ్నాలుకావనిన్నీ, అవి కేవలము వారు ఉత్తమవంశజు లనిన్నీ, ఉన్నతకులం వారనిన్నీ చూపడానికి యేర్పడిన బాహ్యచిహ్నాలనిన్నీ, అందువల్లక్రైస్తవమతంలో కలిసిన హిందువులు తమతమ కులాచారాలకు సంబంధించిన జుట్టు, కట్టు, బొట్టు మొదలైన బాహ్యచిహ్నాలను యేలాంటి అభ్యంతరమూ లేకుండా వుంచుకోవచ్చుననిన్నీ, ఈ క్రైస్తవమతాచార్యులు ఆఖరికి ఒక నిశ్చయానికి వచ్చారు. ఈ సంగతులనీ 1909 లోను, 1913 లోను రాష్ట్రీయక్రైస్తవమతాధికారికిన్నీ, క్రాంగనూరు ఆర్చిబిషపుగారికిన్నీ జరిగిన వుత్తర ప్రత్యుత్తరాలవల్ల కనబడుతున్నవి.

జగద్గురు తత్వబోధకస్వామి

నోబిలీ మధురానగరానికి వచ్చిన ఒకసంవత్సరానికి 1907లో