జగద్గురు తత్త్వబోధకస్వామి
59
లనిగాని అనే అర్ధంలొ ప్రజలు వాడడంలేదు. ప్రజలకు వీరి సంగతి తెలియనే తెలియదు. 'పరంగీ ' అంటే నీతిధర్మాలుగాని, మానమర్యాదలుగాని లేక త్రాగుబోతులుగావుండి అసహ్యకరమైన జంతువుల మాంసాలనూ, తుదకు మనుష్యమాంసాన్నీ కూడా పీక్కుతింటూ శాస్త్రమతధర్మాలు లేని పశుప్రాయులైన నీచమానవు లని ఆమాటకు అర్ధం."
"ప్రతిభాశాలురైన పోర్చుగీసుజాతివారి నెవ్వరినీ హిందువులు చూచివుండ లేదు. ఇక్కడనుండేవారు రెండురకాలవారుగా వుంటారు కొందరు, ఇక్కడనే పుట్టిపెరిగి పోర్చుగీసు రక్తస్పర్శ ఆవంతమైనా లేకపోయినప్పటికీ నాలుగు పోర్చుగీసు ముక్కలు నోటికి రాగానే తమ అసలు జాతిలోనుంచి బైటపడి పోర్చుగీసువారి మైతి మనుకునేవారు. వీరిని పోర్చుగీసువారు 'టోపాజు ' సంకర జాతివాళ్లని అంటారు. హిందూ దేశీయులు వీరిని పరంగీలంటారు. తెల్లవాడైనా నల్లవాడైనా పోర్చుగీసువాళ్ల లాగ దుస్తులు ధరించే నల్లవాళ్ల నందరినీ పరంగీ లనడం అలవాటయింది. ఇక ఇక్కడకు వచ్చే ఇంకొకరకం మనుష్యులు పుట్టుక వల్ల యూదులై వుండిన్నీ పోర్చుగీసువారితో ఏర్పాటుచేసుకొని వర్తక వ్యవహారాల మీద యిక్కడికి వచ్చేవారు. వీరినికూడా మధురాపట్టణవాసులు పరంగీలంటారు. ఈ రెండురకాల వారితో ఏమాత్రం సంపర్కం గలవారికైనా వీరి కులము,శీలము, విశ్వాసపాత్రత, శుభ్రత ఎలాంటివో బాగా తెలిసిన విషయాలే కదా! అందువల్ల 'పరంగీ ' అనే మాట నీచంగా వాడబడడంలో ఆశ్చర్యమేముంది" అని నోబిలీ వ్రాశారు.
'పద్ధతి మార్చాలి'
పైన చెప్పిన సంగతి సందర్బాలన్నీ యోచించిన మీదట హిందువులను క్రీస్తుమత ధర్మాలవైపునకు ఆకర్షించాలంటే ముందుగా మిషనరీలు తమ జీవిత విధానాన్నీ, ఆచారవ్యవహారలనూ, పద్ధతినీ మార్చుకొవలసివున్నదనే సంగతి స్థిరపడివుంది.