పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

కథలు గాథలు

అప్పటి విజయనగర చక్రవర్తియైన రెందవ వెంకటపతి దేవరాయ మహారాయల ఆస్థానంలో వుంటూవున్న ఆంటోనియో రూబినో అనే ఒక క్రైస్తవ ఫాదరీకూడా ఇల్లగే అభిప్రాయపడ్డారు. ఈ రూబినో ఒక ఉత్తరంలో ఇలాగ వ్రాశాడు:- "మనము గొడ్దుమాంసము తిని మద్యపానముచేసే పోర్చుగీసు జాతివార మనే కారణంవల్ల ప్రజలకు మనయందు అసహ్యభావం గలిగి యున్నది. అందువల్లనే మన మతానికి వారిని చేర్చే ద్వారములు మూయబడియున్నవి. మన మీ రాజ్యములో మద్య మాంసములను విసర్జించినా మనపట్ల వారికి విరోధము, అసహ్యము కలగడానికి మన నల్లని దుస్తులే చాలు.అందువల్ల మనలను వారొకమహామ్మారిని చూచినట్లు చూస్తారు. మనము పొర్చుగీసు దేశం నుంచి వచ్చిన క్రైస్తవమత ప్రచారకులమనే సంగతి వాళ్ళమనసులో బాగా నాటుకొనివున్నది. అందువల్ల మన కృషిలో ఫలితం కలగాలంటే ముందుగా మనం ధరించే దుస్తులను మార్చుకోవాలి. తినేతిండిని మార్చుకోవాలి. వీలైనంత వరకూ వారు అవలంబించే ఆచారాలను మనంకూడా అవలంబించాలి. రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారి (Father Provincial) కి ఈ సంగతిని గురించి నేను చాలా సార్లు వ్రాశాను. హిందువులు వేసుకునే దుస్తులు ధరింపజేసి, నన్ను ఎవ్వరూ ఎరగని వూరికి పంపించాలని ఆయన అనుకుంటున్నాడు."

"ప రం గీ లు"

క్రైస్తవమత ప్రచారం బాగా జరగక పొవడానికి ఇంకొక కారణంకూడా యున్నది. క్రైస్తవులైన దేశీయ పరవరులను, వారి మతప్రచారకులును పరంగీలని దేశీయులనేవారు. దీని నిజమైన అర్ధం ఎరగపోవడంవల్ల క్రైస్తవ మిషనరీలు ఆ పేరును స్వీకరించేవారు. ఈ పరంగీ అనే పదాన్ని ప్రజలందరూ చాలా నీచంగా చూసేవారు. నోబిలీ జాగ్రత్తగా విచారించగా దీని కారణం తెలిసింది. "పరంగీ అనే మాటను పోర్చుగీసువారనిగాని, ఐరోపాదేశీయులనిగాని, క్రైస్తవు