పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


వారిలో వివిధకులాల శూద్రజనాన్నిఅరవవారు 'వడుకరు ' లు అనగా 'ఉత్తరాది వా 'ళ్ళని వ్యవహరించేవారు. ఇందులో రెడ్లు, కమ్మవారు, గొల్లలు మొదలైన కులాలవా రుండేవారు. ఆకాలంలొ మన తెలుగువారు ప్రతివిషయంలోనూ అరవలకన్న చొరవకలవారుగా వుండేవారు, వీరు ఈఫాదరీతొ ఎక్కువ స్నేహంగా వుండి ఆయనను గౌరవించేవారు.

  ఈ ఉత్తరాదిజనాన్ని క్రైస్తవమతంలో కలవాలని ఫెర్నాండెజ్ గారు విశ్వప్రయత్నాలు చేశారు. ఏసుక్రీస్తున్ గురించీ, క్రైస్తవమతధర్మాలను గురించీ అతడు ఎన్నివిధాలుగానో వారికి బోధచేస్తూ వుండేవాడు. కాని ప్రయోజనం లెకపోయింది. ఈ ఫాదరీగార్ ఎంత మచివాడైనా గొడ్దుమాంసం తిని, మధ్యపానం చేస్తూ మాలమాదిగలతో కలిసిమెలసి తిరిగేజతివాడనిన్నీ, అందువల్ల మతంలో కలిస్తే కులభ్రష్టులమైపోతామనిన్నీ భయపడి ఎవరూ క్రైస్తవ మతంలో కలవలేదు.
  ఈ ఉత్తరాదిజనాన్ని క్రైస్తవమతంలో కలవాలని ఫెర్నాండెజ్ గారు విశ్వప్రయత్నాలు చేశారు. ఏసుక్రీస్తును గురించీ, క్రైస్తవ మతధర్మాలనుగురించీ అతడు ఎన్నివిధాలుగానో వారికి బోధచేస్తూ వుండేవాడు. కాని ప్రయోజనం లెకపోయింది. ఈఫాదరీగారు ఎంతమంచివాడైనా గొడ్దుమాంసం తిని, మద్యపానం చేస్తూ మాలమాదిగలతో కలిసిమెలిసి తిరిగే పరంగీజాతివాడనిన్నీ, అందువల్ల మతంలో కలిస్తే కులభ్రష్టులమైపోతామనిన్నీ భయపడి అవరూ క్రైవస్తవ మతంలో కలవలెదు.
  కుమారకృష్ణమనాయకుడి తరువాత మధుర రాజ్యాన్ని పరిపాలించిన ముద్దుకృష్ణఫ్ఫ నాయకుడుకూడా క్రైస్తవమత ప్రచారకులతో స్నెహంగానే వుండేవాడు. ఇది విని పోర్చుగల్లుదేశపు రాజుకూడా సంతోషించినట్లు ఉత్తర ప్రత్త్యుత్తరాలవల్ల కనబడుతూవుంది. ఇలాగ 12 సంవత్సరాలు ఫెర్నాండెజ్ ఎతకష్టపడినా క్రైస్తవుమతం వ్యాపింపలేదు.

రా బ ర్టో డీ నొ బి లీ

  ఈ పరిస్థితులలో రాబర్టోలీ నొబిలీ అనే క్రైస్తవ మతప్రచారకుడు 1606 లో మధురానగరానికి వచ్చాడు. నొబెలీ ఇటలీదేశంలో మాంటీ పుల్చియానో అనే గ్రామంలో క్రైస్తవ మత గురువైన పోపులకు బంధువులైన గొప్ప కుటుంబంలో 1577 లో జన్మించారు. అతడు చిన్నప్పటినుంచీ తెలివైనవాడు. తన పదవయేటనే ఐరోపా దేశపు సంస్కృతభాష లనదగిన గ్రీక్ లాటినులను ధారాళంగా మాట్లాడేవాడు. నోబెలీ ఇక్కడి రాగానే మత ప్రచారం