Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

కథలు - గాథలు

యదు వీరికి తెలిసినదల్లా ఆగాఖాన్ అనే ఒక పారశీకప్రభువు తమ మత గురువుగా గౌరవించడం మాత్రమే" నని పెర్రీగారు వ్రాశారు.

ఈ ఆగాఖాను పారశీకదేశంలొ ఇస్మేలీలనే మహమ్మదీయ తెగవారి మతగురువు. తురకలలో వీరు షియామతస్థులు. మహమ్మదు ప్రవక్త అల్లుడైన ఆలీగారిని భగవంతుడి అవతారంగా నమ్ముతారు. ఆ ఆలీగారి దగ్గరనుంచి ఇస్మేయిల్ అనే ఇమాముగారి వరకూ ఈశ్వరాంశ వున్నదనిన్నీ అది ఆగాఖానుగారి వంశంలోపురుషులలో పారంపర్యంగా వస్తూవున్నదనిన్నీ నమ్మి ఇస్మేలీ మతమువా రందరూ ఆగాఖానుగారికి భగవంతునిగానే ఆరాధిస్తారు. ఈ ఆగాఖారుగారికి తమ శక్త్యానుసారంగా ప్రతియేటా కొంతముడుపు చెల్లిస్తారు. ఆ బాపతు ఆయనకు సాలుకు ఒకలక్ష యేబదివేల రూపాయల శిష్యార్జనవుంది.

అందువల్ల ఈ భొజాలుకూడా షియా ఇస్మేలీమత శాఖలో చేరినవారిని యేర్పడుతూ వున్నది. అసలు షియా ఇస్మేలీ మతంలోనే ఇతరుల మనస్సులకు నొప్పి కలిగించకుండా తన మతవిశ్వాసాన్ని కోల్పోకుండా వుండాలనే సిద్ధాంతం ఒకటి వుంది. ఇతర మతాలవారిని తురకలలో కలుపుకునే సందర్భంలో ఇతరమతాలవారి ఆచార వ్యవహారాలను నిరాకరించక క్రూరమైన పద్ధతులతో గాక వారి మతాచారాలను చాలావరకూ అంగీకరించి వాటిని మహమ్మదీయుల మతానికి అనుగుణ్యముగా అర్ధంచెప్పి మతప్రచారం చెయ్యాలనే నియమం కూడా ఒకటి వున్నది. పై రెండు కారణాలవల్లనూ హిందూమతంలో నుంచి తురకలలో కలిసిన భోజాలు చాలావరకు హిందూఆచార వ్యవహారాలనే అవలంబించి వుండడానికి వీలైనది.

హిందూదేశంలో షియా మతస్థులకన్న సున్నీ మతస్థులే అధిక సంఖ్యాకులుగా వున్నారు. సున్నీ మతస్థులకూ షియామతస్థుల ఆచారాలకూ వీరి యాచారాలకూ, చాలా తేడా లున్నాయి. తమదే శిష్టా చారమని సున్నీల ఊహ. ఈదేశాన్ని ఏలిన మహమ్మదీయ రాజులలో చాలామంది సున్నీమతంవారే. అందువల్ల ఈ సున్నీల మధ్య జీవించే