పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కథలు గాథలు


ఆదాయం వస్తుంది. ఆ సొమ్ములో చాలా భాగం గుఱ్ఱపు పందెముల క్రింద ఆయన ఖర్చు పెడుతాడు' ' అని 1866 లో బొంబయి సుప్రీముకోర్టు న్యాయమూర్తి ఆర్నాల్డుగారు తమ తీర్పులో అప్పటి ఆగాఖాను చరిత్రను వ్రాశారు.

ఇప్పటి ఆగాఖానుగారుకూడా చాలా ధనవంతుడనిన్ని, గుఱ్ఱపు పందెములలో అందెవేసిన చెయ్యి అనిన్నీ, చాలా భోగి అన్నీ, ఎప్పుడూ ఐరోపాలోనే వుంటాడనిన్నీ, అందరికీ తెలిసిన విషయమే.

ఖో జా లు

ఖోజాలనే తెగవారు వేషభాషలలో ఆచారవ్యవహారాలలో హిందువులు, మతంలో మహమ్మదీయులు. వీరిని గురించి వచ్చిన వ్యాజ్యాలను పరిష్కరిస్తూ బొంబయి సుప్రీము కోర్టు న్యాయాధి పతియైన సర్. ఎర్ స్కిన్ పెర్రీగారు 1847 లో యిచ్చిన తీర్పులోను, బొంబయి హైకోర్టులో అడ్వకేటు జనరలుగారికీ, ఆగాఖాను గారికీ జరిగిన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ 1866 లో ఆర్నాల్డు అనే న్యాయాధి పతి ఇచ్చిన తీర్పులోనూ 1875 లో వచ్చిన వ్యాజ్యంలో సర్ చార్లెస్ సార్జెంటుగారనే న్యాయాధిపతి యిచ్చిన తీర్పులోనూ వీరిచరిత్ర చాలా విపులంగా చర్చింపబడింది. వీరికి వారసత్వ విషయములో హిందూ ధర్మశాస్త్రమున్నూ తక్కిన విషయాలలో మహమ్మదీయ ధర్మశాస్త్ర మున్నూ వర్తిస్తాయని నిర్ణయించబడింది.*[1]

“ఖోజాలు హిందు దేశంలో పడమట భాగంలో సివసించే ఒక చిన్న తెగ వారు. వీరు మొదట సింధు, కచ్చి రాష్ట్రములనుండి వచ్చి నట్లు కనపడుతూవుంది. సుమారు అయిదువందల సంవత్సరాల క్రిందట సదర్ దీన్అ నే మ హ మ్మ దీ య పీ రు ( మ హా త్ము డు )

వీరిని హిందూమతంలో నుంచి తురకలలో కలిపినట్లు చెప్పుకుంటారు.

  1. (1) Cases Illustrative of Oriental Life decided in the Supretne Court of Bombay. (1853) Sir Erskine l'erry pp. 110-129 (2) The Advocate general and others vs. Muhammed Hussain Husseni (Aga Khan) and others. 12 Bombay High Coult Reports pp. 294 and 323.