Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తురకల దశావతారములు

41

ఆ కేసులో రుజువుచేశారు. ఈ ఆగాఖానుగారు ఇస్మేలీ షియా మహమ్మదీయుల అనువంశిక మత గురువు. ఏ తెగవారినైనా మహమ్మదీయుల నందరినీ 'తురక ' లని వ్యవహరించడం పరిపాటి అయినది.

క్రీ.శ.16 వ శతాబ్దంలో పారశీకదేశం షియా మతాన్ని స్వీకరించినది మొదలు ఇస్మేలీల బాధలు తగ్గినాయి. ఈమహమ్మదు హుస్సేన్ హుస్సేనీగారి తాత, పారశీక దేశంలో కెర్మను నగర పరిపాలకుడుగా ఉండేవాడు.ఆ ఉద్యోగం అయిపోయిన తరువాత మెహెంతీ జిల్లాలో ఉండేవాడు. ఆయన కొమారుడు హుస్సేనీగారి తండ్రి, యెజ్డు నగరంలో వుండగా ఆయనను 1817 లో హత్య చేశారు. 1838 లో ఆగాఖాను పితూరీ చేసి కెర్మనునగరం పట్టుకున్నాడు. ఆ సమయంలో ఆగాఖానుదగ్గర నౌకరుగా వుండినవాడు పారశీక రాజుదగ్గర పలుకుబడి సంపాదించి ఆగాఖాను కొమార్తెను తనకు పెళ్ళి చెయ్యమని అడిగాడు. ఇది సహించలేక ఆగాఖాను 1840 లో హిందూదేశానికి వచ్చాడు. సింధులో వుండే మూడువేల కుటుంబాల వారు ఆగాఖానుకు సాలీనాకప్పం చెల్లించడంవల్ల సొమ్ముకు ఇబ్బందిలేదు. ఆగాఖాను 1841-42 మధ్య ఆఫ్ గను యుద్ధంలో ఇంగ్లీషు వారికి సహాయంచేశాడు. ఇంగ్లీషువారు 1843-44 లో సింధు అమీరుల రాజ్యాన్ని ఆక్రమించినప్పుడుకూడా ఆగాఖాను వారికి సహాయం చేసినందువల్ల ఆయనకు ఇంగ్లీషువారు ఫించను యిచ్చారు.

1845 లో ఆగాఖాను బొంబయిలో స్థావరంగా వుండడం ప్రారంభించాడు. ఆయన బొంబాయిలో జమాత్ ఖానాలో అధ్యక్షత వహించి మొహరంలోనూ పండుగరోజులలోనూ బహిరంగంగా జరిగే నమాజులో పాల్గొంటాడు. అప్పుడు అలీ కుమారుడు హుస్సేను చచ్చిపోయిన కెర్బాలా పట్నం మట్టిని కలిపిన నీటిని అందరికీ తాగడానికి ఇస్తాడు. ఖోజా తెగవారు ఆయనకు పాదపూజలు సమర్పించి భక్తితో చేతిని ముద్దు పెట్టుకుంటారు. కాఠియవాడు కచ్చి బొంబాయి జాంజిబారు మొదలైన ప్రాంతాలలొ వుండే శిష్యులిచ్చే పాదపూజ సొమ్మువల్ల ఆయనకు సాలియానా ఒకలక్ష యేబదివేల రూపాయిల