36
కథలు గాథలు
1835 వరకూ హిందూదేశంలో వున్న వివిధరాజ్యాలవారు మొగలాయి చక్రవర్తి దర్బారులో తమతమ ప్రతినిధులను రాయబారులుగా నుంచేవారు. ఆపరిస్థితిని కంపెనీవారు 1835 లో రద్దు పరిచారు.
గవర్నరుజనరలైన హేస్టింగ్రుప్రభువు కాలంనాటివరకూ గవర్నరుజనరలు సహా ఇంగ్లీషు అధికారులందరూ ఢిల్లీచక్రవర్తికి నజరులు సమర్పించేవారు. హేస్టింగ్సు ఈమర్యాదను పాటించకపోగా 1823-26 మధ్య కలకత్తాలో క్రైస్తవమతాధికారిగా వుండిన బిషప్ హెబరుగారు హేస్టింగ్సు చర్యను విమర్శించారు. తరువాత కంపెనీ కింది అధికారులుమాత్రం 1843 వరకూ చక్రవర్తికి నజరులు చెల్లించేవారు. గవర్నరుజనరలైన ఎల్లెన్ బరో ఈ ఆచారాన్ని కూడా 1843 లో మాన్పించాడు.
ఢిల్లీచక్రవర్తిగారి రాయబారిని తన దర్బారులో నుంచుకోవడానికి గవర్నరుజనరలైన డల్ హోసీప్రభువు 1853 లో నిరాకరించి చక్రవర్తిని ఒక సామాన్యవ్యక్తిస్థితిలోకి దింపినాడు. ఢిల్లీచక్రవర్తిని ఆయన వారసులను ఢిల్లీ కోటలోనుంచి సాగనంపాలని కూడా ఆ కాలంలో ప్రయత్నించారు గాని అది సాగలేదు. ఇదంతా దేశీయుల మనస్సులకు కష్టం కలిగించింది.
చక్రవర్తికి ఖైదు
1837 మొదలు బహదూరుషా మొగలాయి చక్రవర్తిగా వుంటూయున్నాడు. 1857 లో ఇంగ్లీషు వర్తక కంపెనీవారి దొరతనాన్ని సిపాయిలు ధిక్కరించగా దేశంలో జరిగిన మహాయుద్ధంలో కంపెనీ వారిమీద కత్తికట్టిన వారిలో బహదూరుషా ఒకడనిన్నీ, తెల్లదొరల వధలకు ఆయన మద్ధతు చేశాడనిన్నీ, ఇంగ్లీషు కంపెనీ ప్రభుత్వం వారు ఆయనమీద నేరంమోపి 1858 జనవరిలో ఆయనను తమ న్యాయస్థానం ఎదుట విచారణకు పెట్టారు. ఇంగిలీషు న్యాయస్థానం వారు బహదూరుషా చక్రవర్తి నేరస్థుడని నిర్ణయించి 1858 న