28
కథలు - గాథలు
ఇంగ్లీషు వర్తక కంపెనీకి దివానిగిరీని ప్రసాదించిన షా ఆలం చక్రవర్తి అసలు పేరు ఆలీగోహర్. ఆయన అలంగీరు చక్రవర్తి కొమారుడు. అతడు 1728 లో జన్మించాడు. తండ్రికి ఆయనమీద దయదప్పగా అప్పట్లో అయోధ్యలో రాజ ప్రతినిధిగా వున్న 'నవాబు నజీరు ' షుజాఉద్దౌలాను ఆశ్రయించి అక్కడ తల దాచుకున్నాడు. షుజాఉద్దౌలా బలవంతుడై చక్రవర్తినికూడా లోబరచుకొన్నాడు. ఆలంగీరు చక్రవర్తి 1759 లో దుర్మరణము పొందగా షాఆలం చక్రవర్తియైనాడు. ఈయనకూడా షుజ ఉద్దౌలా చెప్పుచేతలలొనె వున్నాడు.
మూర్షిదాబాదును రాజధానిగా చేసుకొని వంగరాష్ట్రాన్ని పరిపాలిస్తూవున్న రాజప్రతినిధియైన ఆలావర్గీఖాను చనిపోగా ఆయన మనుమడు దత్తపుత్రుడునైన సురాజుద్దౌలా 1756 లో నవాబు అయినాడు. కొత్తనవాబు చాలా చిన్నవాడు. అప్పట్లో కలత్తాలో వర్తకం చేసుకుంటూవున్న ఇంగ్లీషువారి అక్రమ చర్యలను హర్షించక వారిని దండించాడు. అంతట వారు ఆయన మంత్రులను తిరుగదీసి ఆయన బంధువుడున్నూ మంత్రిన్నీ అయిన మీర్జాఫరుచేత స్వామిద్రోహము చేయించి 1757 లో ప్లాసీయుద్ధంలో నవాబును ఓడించారు. ఈ యుద్ధంలో విజయం పొందిన క్లైవుయొక్క ధైర్యసాహసాలకు అయోధ్యనవాబున్నూ చక్రవర్తిన్నీ కూడా సంతోషించారు. సురాజుద్దౌలా దుర్మరణం పొందగా మీర్జాఫరును నవాబుగా అంగీకరింప జేయడానికి క్లైవున్నూ ఇతర ఇంగ్లీషు ఉద్యోగులున్నూ చాలా సొమ్ము లంచము పుచ్చుకొని చక్రవర్తికి శిఫారసుచేసి మీర్జాఫరును నవాబుగా చేసి కృతకృత్యులైనారు.
మహారాష్ట్ర వ్యవహరాలలో క్లైవు చూపిన చాకచక్యానికి చక్రవర్తి అతనిని ఆరువేల గుర్రపుదళానికి అధికారి యనే గౌరవబిరుదు నిచ్చాడు. ఆయుద్యోగము నకు న్యాయంగా సాలుకు ముప్పైవేల సవరసుల జీతము తనకు రావలెనని క్లైవు మీర్జాఫరును నిర్భంధించి అందు క్రింద 24 పరగణాలను జాగీరుగా పుచ్చుకున్నాడు. ఈమీర్జాఫరు కేవలము ఇంగ్లీషు కంపెనీ యుద్యోగుల చేతులలో కీలుబొమ్మగా