26
కథలు - గాథలు
నమ్మకంగా పనిచేసి సమర్ధుడనీ, నమ్మకమైనవాడనీ కలక్టరువల్లనె అనేక యోగ్యతా పత్రాలు పొందిన ఈ దేశీయోద్యోగి పనిని తీసివెయ్యడాన్ని సమర్ధించారు!
చెన్నపట్నం దొరతనమువారివల్ల న్యాయం కలగకపోగా నరసింగరావుగారు ఈ సంగతులన్నీ తెలుపుతూ ఇంగ్లాండులోవున్న కంపెనీ డైరెక్టర్ల సభవారికి 1855 లో ఒక విన్నపము పంపించారు. అంతట సర్కారుకొలువులో ఏ ఉద్యోగమూ ఇవ్వకూడదనే నిషేధాన్ని తోలగిస్తూ 1856 లో వుత్తర్వులు వచ్చాయి. అయితే ఈలోపుగా నరసింగరావుగారు విజయనగరం ఎస్టేటుదివాను అయి ఆజమీందారీ రివిన్యూ పరిపాలన చక్కగా నిర్వహిస్తూవున్నందువల్ల మళ్లీ సర్కారు నౌకరీలో చేరడం అసంభవము అయింది.
గంజాం శిరస్తాదారు కథ
ఈదేశీయుణ్ణి ఇలాగ బాధించి వుద్యోగంలోనుంచి తొలగించి దీనికంతా కారకుడై న రాజమహేంద్రవరం కలెక్టరు ప్రెండరుగాస్టు గారికి గంజాంజిల్లాలో గవర్నరుగారి ఏజెంటుహోదాతో పెద్ద గౌరవ వుద్యోగం యిచ్చారు. ఈ దొరగారు అక్కడికి వస్తున్నాడనేటప్పటికి అక్కడివారిలో చాలమందికి భయం కలిగింది. ఈ కొత్త ఏజంటుగారు ఆపనిలో ప్రవేశించిన కొన్ని వారాలలోనే, గంజాముజిల్లాలో పెద్ద ఉద్యొగాలు చేస్తూవున్న దేశీయులను చాలామందిని పనిలోనుంచి తొలగించారు. సర్కారుకింద నలభైసంవత్సరాలు నమ్మకంగా పనిచేసి అతడు చేసిన రాజకీయ సేవకు ఒక బిరుదును పొందడానికీ, ఫించను పుచ్చుకోవడానికి సిద్ధంగా వున్న హెడ్డుశిరస్తాదారు పైన ఈ దొరగారు ఏదో నేరం మోపి పట్టుకొని శ్రీకాకుళం సెషన్సు కోర్టుకు పంపారు ఆ కోర్టుజడ్జీగారు ఈఫిర్యాదులోని సంగతులు చాలా హాస్యాస్పదమైన స్వల్పవిషయాలై వుండడం చూచి ఆయనమీద నేరం మోపి కేసు విచరించడానికి యిష్టపడక ఆఖరికి దానిని కొట్టివేశారు. ఇది జరిగి పదిహేను నెలలు అయినా ఉద్యొగరీత్యా ఆ శిరస్తాదారుగారి వ్యవహారం పరిష్కారం కాకుండా ఇంకా విచారణలోనే వుంది. దానికి