24
కథలు - గాథలు
యెరగడు. ఈమారు అతడు ఇలాగు ఎందుకు చేశాడో తెలియడంలేదు. ముద్దాయి (శిరస్తాదారు)పైన పన్నబడిన ఒక కుట్ర లో ఇత నొక భాగస్వామి అవడానికి ఎంతమాత్రమూ వీలులేదు. వివేకంగలవారెవ్వరూ అలాంటి దుర్మార్గంలో చేరడు. ఎంత స్వల్పమైన లోపమునుగాని పట్టుకోకుండా వదలని తెలివితేటలు గల అతిసమర్ధుడైన అకవుంటేంటు (తిమ్మరాజుగారు) వున్నాడు కదా అనే నమ్మకంతో నేను స్వయంగా సరిచూడ కుండ ఆలెక్కమీద సంతకం పెట్టాను. ఈవిధంగా ఆలొచిస్తే ఇది అంత పెద్దపొరపాటు కాకపోయినా దాన్ని గురించి నేను సమర్ధించుకోవడానికి ప్రయత్నించను. కలెక్టరుసంతకంతో జారీఅయ్యే లెక్కలయొక్క నిర్ధిష్టతకు కలెక్టరే బాధ్యుడని (రూల్సులో)ఇప్పుడు నిర్ణ యించబడినట్లు అప్పటికి విధించబడియుండనందువల్ల ఈతప్పుడు లెక్కకు తిమ్మరాజుగారే జవాబుదారు అయివున్నాడు" అని కలెక్టరు గారు కమిషనరు గారికి వ్రాసి తన బాధ్యతను తప్పించుకోవడానికి తిమ్మరాజుగారి మీదికి త్రోసివేసి వూరుకున్నాడు.
"ముద్దాయి నేరాన్ని స్థాపించే లెక్క" అని తాను తయారుచేయించి జిల్లాకోర్టు వారికి పంపించిన లెక్క తప్పుడు లెక్క అని తేలింది. ముద్దాయినిర్దోషి అని రుజువు అయింది. ఇలాగ నిష్కారణంగా ఒక నల్లవాడిని సామాన్యఖైదీలనుంచే బందిఖానాలో పడవేసివుంచడము,పదహారునెలలు విచారణలో నిర్భంధించి వుంచడమూ అంతగా విచారించతగిన అంశము కాదని ఈదొరగారు అనుకొని వుంటారు.
ఇంకో కేసు
ఒకప్రక్క ఈశిరస్తాదారుగాని కేసు జరుగుతూ వుండగా ఈ కలెక్టరుగారు పిఠాపురం మైనరుజమీందారు సంరక్షుకుడైన రాజబంధువు (Uncle) మీదకూడా ఒక నేరాన్ని మోపి ఆయనను ఖైదులో వుంచారు. పైన చెప్పిన 67 వేల రూపాయలతో సహా ఇంకాకొంత ఎస్టేటు ఆస్తిని హరించి నేరం చేశాడని ఆయనమీద ఒక కేేసు దాఖలు చేశారు. ఆకేసును సర్కారుతరపున నడపడానికి నాలుగువందల మైళ్ల దూరాన్నుంచి ఇంగ్లీషుబారిష్టర్లను తెచ్చి దీనికోసం అయిన