పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లా శిరస్తాదారు

23


చేసినవారు కలెక్టరుగా రెన్నడూ విశ్వాసముంచని చిన్నవయస్సుగల ఇద్దరు గుమాస్తాలని తిమ్మరాజుగారు చెప్పినాడని కలెక్టరుగారు తమ వుత్తరంలో వ్రాస్తూ ఇంకా యీకింది సంగతులు కూడా వ్రాశారు.

"ఆలెక్క నాదగ్గరికి తెచ్చినప్పుడు మేజస్ట్రీటు కేసులో ఏదైనా పొరబాట్లు వస్తే చాలా చిక్కులు కలుగుతాయి గనుక నేను క్షమించను సుమా అని చెపుతూ ఆకాగితాన్నినేను శిరస్తాదారు శాఖలోకి పంపించాను. అందులో ఏదో అనుమానం తోచి దానిని మళ్లీ ఇంకోసారికూడా సరిచూడడానికి నేను పంపించినట్లుగా నాకు జ్ఞాపకం. అయితే ఆ సంగతిని నేను గట్టిగా చెప్పలేను .

"ఆలెక్కను జాగ్రత్తగా సరిచూసే విషయంలో నేను చేయగలిగినదంతా చేశానని అనుకున్నాను.

"తిమ్మరాజుగారే జవాబుదారు"

"దస్తులో 67000 రూపాయల లోటు కనబడుతూవుందని నేను సెషన్సు కోర్టుకు వ్రాసినప్పుడు పైన చెప్పిన విధంగా హెచ్చరించిన తరువాతకూడా పైయిద్దరు గుమాస్తాలున్నూనన్ను మోసంచేయడానికి సాహసిస్తారని నేను అనుకోలేదు. తిమ్మరాజుగారు తన ఉద్యోగాన్నిబట్టి చేయవలసినపని చేయకుండా ఇంత అజాగ్రత్త వహిస్తాడనిన్నీ నేను అనుకోలేదు. ఈ తప్పిదాన్ని మన్నించే విషయంలో నేనేమి చెప్పడానికి నాకు తోచడంలేదు. నేను ఎంతో విశ్వాసముంచిన మనిషి, పాతశిరస్తాదారును నష్టపరచడానికి ఒక దొంగ లెక్క తయారుచేసిన వాడనిగాని, తాను స్వయంగా పరిశీలించకుండానూ, లేదా తనక్రింది వుద్యోగులచేత జాగ్రత్తగా సరిచూపించకుండానూ ఆకాగితాన్ని తన కచ్చేరీలో నుంచి జారీచేశాడనిగాని ఇటువంటి అపవాదుకు గుఱిఅయ్యేటందుకు అవకాశం యివ్వడం నామనస్సుకు చాలాకష్టం కలిగిస్తూవుంది."

"ఇది చాలా విపరీతమైన సంగతిగా వుంది. ఇదివరకెన్నడూ యిటువంటి అజాగ్రత్తను, బుద్ధిమాంద్యమును తిమ్మరాజు ప్రదర్శించి