22
కథలు - గాథలు
ఈ హెడ్డుశిరస్తాదారు యొక్క నేరాలతో సంబంధం లేక పోయినా ఆయన జరిగించిన మోసకృత్యాలను బయటికి తియ్యడంలో కలెక్టరుగారికి సహాయం చేయలేదనే నెపంమీద అతని క్రింది యుద్యోగియైన డెప్యూటీ శిరస్తాదా రునుకూడా పనిలోనుండి తీసివేశారు.
కలెక్టరు సంజాయిషీ
జిల్లాకోర్టువారు అతనిని నిర్దోషిఅని వదలగానే కంభం నరసింగరావుగారు తనపై వచ్చిన దస్తుఫాజలునేరమనేది అభూతకల్పన మనిన్నీ, తనను పనిలోనుండి తీసివేయడము అక్రమమనిన్నీ, పిఠాపురం జమీందరీ తాలూకు ఆస్తియేదిన్నీ బీరుపోలేదనిన్నీ, అలా పోయినట్లు చూపడానికి తయారుచేయబడిన లెక్కలు అబద్దములనిన్నీ ఉత్తర సర్కారుల కమిషనరుగారికి అర్జీద్వారా తెలియపరిచారు. ఇతడు వ్రాసిన సంగతులను కమిషనరుగారు కలెక్టరుకు పంపించి దానిని గురించి సంజాయిషీ యివ్వమని కోరారు. దానికి జవాబుగా 1843 సం. నవంబరు 2-వ తేదీన కలెక్టరుగారు ఒక ఉత్తరం వ్రాశారు. తిమ్మరాజుగారిని పిఠాపురం మేనేజరుగానూ, కలెక్టరు కచ్చేరీ శిరస్తాదారుగానూ నియమించిన సందర్భాలను గురించి ఆ జవాబులో మొట్టమొదట వివరించారు. ఈజిల్లాలో ఏర్పడిన క్లిష్టపరిస్థితి లో విశ్వాసపాత్రుడైన ఉద్యోగి ఒకడు తన ఖుద్దున వుండడం అవసరం గనుక ఈ తిమ్మరాజుగారిని ప్రత్యేకంగా ఏరి శిరస్తాదారుగా నియమించానని వ్రాశారు. నరసింగరావుగారిమీద మోపిన దస్తుఫాజలు నేరాలన్నీ నిరాధారా లనే సంగతిని కలెక్టరు గారు ఒప్పుకొన్నారు. నరసింగరావుగారి లెక్కలనుబట్టి పిఠాపురం జమీందారీ తాలూకు 67000 రూపాయలకు లెక్క తేల లేదనే విషయాన్ని గురించి అతి కష్టంమీద తిమ్మరాజుగరివల్ల సంజాయిషీ పుచ్చుకోగలిగాననిన్నీ, అయితే ఆ సంజాయిషీ చాలా అసంతృప్తికరంగావున్నదనిన్ని, అందువల్ల నిజంగా ఆసొమ్ము లోటుబడలేదని అంగీకరించినట్లే ఎంచవలసివుంటుందనిన్నివ్రాశారు. ఆలెక్కను తాను చూడనేలేదనిన్నీ, దానిని తయారుచేయడంలో తన కేమీ ప్రసక్తి లేదనిన్నీ, దానిని తయారు