Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లా శిరస్తాదారు

21

గురించీ తనకచ్చేరీ వుద్యోగులు తనకు తెలియనియ్యకుండా కుట్రచేశారనిన్నీ, తనఒక్కడికీ తప్ప రాజమహేంద్రవరం జిల్లాలో అందేదికీ తెలుసుననిన్నీ, కొత్తగా తనకు అనుచరులైన తిమ్మరాజు గారున్నూ, అమల్దారున్నూ తన నీచిక్కు లొనుంచి బయటికి తీసారనిన్నీ కమీషనరుగారికి తెలుపుతూ, ఈ క్రిమినలు కేసులో ఆముద్దాయికి శిక్షపడుతుందనే ధృఢనమ్మకంతోనూ తాను వ్రాసిన సందర్భాలలోనూ ఆముద్దాయి ఇదివరకు చేస్తూవుండిన నౌకరీలోనుంఛి అతనిని తొలగిండానికి తనకు అధికారం యివ్వవలసిందనిన్నీ, ఒకవేళ మమిషరుగారు ఇందుకు ఇష్టడనిచో, ఒకవేళ ముద్దాయిని కోర్టువారు నిర్దోషి అని వదలివేసినా, తనకూ ఆ శిరస్తాదారునూ యిక సహకారం గాని, సామరస్యంగాని వుండడం దుస్తరమనిన్నీ, అందువల్లనైనా అతనిని పనిలోనుండి తొలగించడానికి అంగీకరించవలసినదనిన్నీ, ఈ కలెక్టరుగారు గట్టిగా వ్రాసినందువల్ల అతనిని పనిలోనుండి తీసివేయడానికి కమిషనరుగారు అధికారం యిచ్చారు.

నరసింగరావు గారికి ఉద్వాసన

అంతట కలెక్టరుగారు యీవిధంగా ఒక తాఖీదు జారీచేశారు:

"కంభం నరసింగరావుకు---

నీప్రవర్తనను గురించిన విచారణ పూర్తిఅయ్యేవరకూ నిన్ను పనిలోనుండి సస్పండుచేసినట్లు ఇదివరకే నీకు తెలుపబడివున్నది. పిఠాపురం ఎస్టేటు ఆస్తిని కోర్టుఆఫ్ వార్డ్సువారికి వశపరచగలందులకు నిన్ని నియమించి పంపినంతలో నీ ప్రోత్సాహంవల్లను, దుష్ప్రవర్తన వల్లను ఆజమీందారీతాలూకు చాలా వస్తువులున్నూ సొమ్మున్నూ అపహరించబడినట్లు దరిమిలాను చేయబడిన దర్యాప్తువల్ల రుజువు అయినది. నీవు ఇతరమైన అక్రమచర్యలుకూడా చేసినావు. నీవు విశ్వాసపాత్రుడవు కానందువల్ల నీవిషయమై ఉత్తరసర్కారుల కమిషనరు గారికీ తెలియపరచగా నిన్ను తొలగించుటకు ఆయన అధికారం యిచ్చిన్మారు. నీవు సర్కారునవకరీకి తగవుగనుక నిన్ను సస్పెండు చేసిన తేదీలగాయతూ నీకు జీతము ఏమీ యివ్వబడరు."