20
కథలు - గాథలు
లోటుసంగతి తనకు చెప్పలేదనిన్నీ, శిరస్తాదారుగారి దుర్మార్గం వల్లనే ఈ సొమ్ము (ఫాజలు) అపహరించ బడిన దనిన్ని కలెక్టరుగారు వ్రాశారు.
ముద్దాయి విడుదల
కలెక్టరుగారు నరసింగరావుగారిని పనినుంచి తీసివేసిన తరువాత ఆయన స్థానంలో తాత్కాలికంగా తిమ్మరాజుగారినే శిరస్తాదారుగా నియమించారు. పైన చెప్పినట్లు జిల్లాకోర్టువారు కలెక్టరు కచ్చేరీరికార్డును సోదాచూసి లెక్కజాబితాను పట్టుకువెళ్లిన తరువాత పిఠాపురం ఎస్టేటుకు కలిగిన నష్టాన్ని గురించి కలెక్టరుగారు ఒక స్టేటుమెంటు (తబ్సీళ్లవారీ వివరణము)ను తయారుచేయించి ఈస్టేటుమెంటు ముద్దాయి (నరిసింగరావుగారి) నేరాన్ని స్పష్టముగా ఋజువు చేస్తుందని వ్రాస్తూ దానిని జిల్లాజడ్జిగారికి పంపించారు. నరసింగరావుగారి కేసు జిల్లాకోర్టులో పదహారునెలలు వాయిదాలు పడిపడి చివరకు విచారణ అయింది. కలెక్టరుగారు పంపించిన స్టేటుమెంటు అనేది మొదటినుంచి చివరదాకా అభూతకల్పనమని కోర్టువారికి నచ్చేటట్లు ముద్దాయి ఋజువు చెయ్యగలిగాడు. విచారణసందర్భంలో ఈకేసు దాఖలవడానికి మూలకారకుడైన పిఠాపురం అమలుదారు ఫిర్యాదును సమర్ధించడంకోసం అబద్ధపుసాక్ష్యం యిచ్చినట్లు జడ్జీగారికి తోచి అతనిని ఖైదులో పెట్టారు. అతని పనినికూడా తీసివేశారు. ముద్దాయి నరసింగరావుగారిని నిర్దోషి అని విడుదల చేశారు. పదహారు నెలలు ఖైదులో మగ్గిమనోవ్యధ అనుభవించి ఆయన బయటికి వచ్చాడు.
కలెక్టరుగారి పగ
ఒకమూల యీకేసు జరుగుతూవుందగానే కలెక్టరుగారు నరసింగరావుగారిని గురించి తనపై యధికారియైన ఉత్తర సర్కారుల కమిషనరుగారితో ఉత్తర ప్రత్యుత్త రాలు జరపడం ప్రారంభించారు. ఈశిరస్తాదారుయొక్క దుష్ప్రవర్తనవల్ల సర్కారు సంరక్షణలో వున్న మైనరు జమీందారుకు కొన్ని వేలసవరసుల నష్టం కలిగిందనిన్నీ, ఘోరమైన ఈ అన్యాయపుమోసమును గురించీ, అపహరణమును