పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

కథలు - గాథలు

హెన్రీ వైబార్టు దొరగారి శిఫారసువల్ల కలక్టరు ఆఫీసులో ఇంగ్లీషు రికార్డుకీపరుపని, సాల్టురైటరీ, అమల్ దారి, నాయబు శిరస్తాదారి, ఆక్టింగు హెడ్ శిరస్తాదారి మొదలైన వుద్యోగాలు చేశారు. తరువాత సదరామీన్ పనికూడా చేసి పించను పుచ్చుకుని 1856 సం. ఫిబ్రేవరి 6 వ తేదీన స్వర్గస్థులైనారు. వీరు కాకినాడలో శ్రీభీమేశ్వరస్వామిని ప్రతిష్ఠించి 1828లో ఒకగొప్ప దేవాలయాన్ని కట్టించారు. 1862లో శ్రీగంగాధర రామారావుగారికి మైనారిటీ తీరి పిఠాపురం జమీందారు అయిన తరువాత తిమ్మరాజుగారి పెద్దకుమారుడైన వెంకట శివరావు గారిని మొదట శిరస్తాదారుగానూ, తరవాత 1872లో మేనేజరు గానూ, పిమ్మట దివాను గానూ నియమించారు. రాజాగారు 1890 లోనూ శివరావుగారు 1892లోనూ చనిపోయారు. వీరిని గురించి ఇప్పటికీ చాలాకధలు చెప్పుకుంటారు.

నరసింగరావుగారిమీద కేసు

పైన చెప్పినట్లు తిమ్మరాజుగారు మేనెజరుగా ప్రవేశించిన కొద్ది రోజులలో జమీందారీ వ్యవహారాలు తనిఖీ చేయగా ఎస్టేటు తాలూకు లెక్కపుస్తకాలలో చాలా పుస్తకాలు కనబడలేదు. దర్యాప్తును బట్టిన్నీ, సంగతి సందర్భాలను బట్టిన్నీ ఆలోచించగా ఆ లెక్కలవల్ల జమీందారీ తాలూకు ;యావత్తునగలూ, రొక్కమూ, చరాస్తిన్నీ కలెక్టరుగారికి స్వాధీనం కాకుండా ఇంకా చాలా మిగిలి పోయిన వనే సంగతి బయట పడుతుందనే భయంతో కొందరు కుట్రచేసి ఆస్తిని హరించి పుస్తకాలను గైరువిలియా చేయించారని తోచింది. ఈ కుట్రలో నరసింగరావు గారుకూడా భాగస్వాములై వున్నట్లు అనుమానం కలిగింది. ఈ సంగతిని మేనేజరుగారు కలెక్టరు గారికి తెలియజేశారు. అప్పటికి కొంతకాలంనుంచి కలెక్టరు గారికి నరసింగరావుగారి మీద మంచి అభిప్రాయం లేనందువల్ల ఈసంగతిని విన్నతక్షణమే కలెక్టరు గారు ఆయనను పనిలోనుంచి తగ్గించి సస్పెండు చేసి ఖైదులో పెట్టి ఆయనను గురించి స్వయంగ విచారణ చేయడం ప్రారంఃభించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకేమి కొదవ? నరసింగరావు గారంటే