పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లా శిరస్తాదారు

17

వప్పచెప్పడానికి బదులుగా జమీని దు:స్థితిలోకి తెచ్చి అప్పుతో వప్పగించి నందువల్ల జమీందారుగారు తమ జమీందారీని నిలబెట్టు కొనడానికి సగం జమీందారీని గవర్నమెంటుకు యిచ్చివేయవలసివచ్చింది. 1844 మొదలు 1850 వరకూ సూర్యారావుగారి పరిపాలనలో జమీందారీ మళ్లీ బాగుపడి కొంత నిల్వలోవుంది. మళ్లీ సర్కారువారి అజమాయిషీ రాగానే వ్యవహారాలు పాడవడం ప్రారంభమైంది. 1853 లో ప్రకటించిన లెక్కలనుబట్తి నిలవ లేకపోగా ఆ సాలు తాలూకు శిస్తులో 65000 రూపాయలు బకాయి కనబడింది. దానికి కలెక్టరు జమాఖర్చు చెప్పలేదు. కలెక్టరుగారి ఆజమాయిషీని గవర్నమెంటువారు పరిశీలించడంలో దీనిని గురించి ఏమీ సెలివివ్వలేదు.

దిగవల్లి తిమ్మరాజు గారు

పైన చెప్పినట్లు జమీందారుగారి ఆస్థిని స్వాధీనపరుచుకొనడానికి వెళ్లినప్పుడు జమీందారుగారి తాలూకు విలువగల చరాస్తిలో చాలా కొద్దిభాగం మాత్రమే ఆయన రాజబంధువులు కలెక్టరుగారిని వశపరచగా కోటను సోదా చెయ్యడానికి వారంటు జారీ చెయ్యవలసినదని హెడ్డుశిరస్దారుగారు సలహా యిచ్చారు. కాని కలెక్టరు ఆ సలహా ప్రకారం జరుపలేదు. ఆఖరికి ఒక నెల జరిగిన తరువాత యాభై వేల రూపాయ్హల విలువగల చరాస్తి కలెక్టరుగారికి వశమైంది. అప్పుడు ఈ జమీందారీ వ్యవహరాలను చక్కబెట్టడానికి నెలకు 250 రూపాయల జీతంపైన శ్రీ దిగవల్లి తిమ్మరాజు పంతులుగారిని (కోర్టు ఆఫ్ వార్డ్సు) మేనేజరుగా నియమించారు. పిఠాపురం జమీందారీ శిస్తులు వసూలు చెయ్యడానికి - కచేరీలో పనికోసం నిరీక్షిస్తూ వాలంటీరుగా వుమ్మేదువారు చేసే ఆయనను ఒకరిని తాశిల్దారుగా నియమించారు.

ఈ తిమ్మరాజుగారు చాలా అనుభవజ్ఞడైన వుద్యోగి. ఆయన కృష్ణాజిల్లాలో కొయ్యూరునుంచి1807 లో ఏలూరు వచ్చి ఇంగ్లీషు చదువుకొని రాజమహేంద్రవరంవచ్చి అక్కడజిల్లాకోర్టులో పీటర్ రీడ్ కాజులెట్ గారి కాలంలో రికార్డుకీపరు మదద్గారీ, శిరస్తామదద్గారీ, శిరస్తా హెడ్ మదద్గారీ పనిన్నిచేసి, 1824 లో జిల్లాజడ్జీ చేసిన