పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లా శిరస్తాదారు

15


శిరస్తాదారులు

కలెక్టరు కచేరీలలో శిరస్తాదారులుగాను, శిరస్తా మదద్గారు, లేక డిప్యూటీశిరస్తాదార్లుగాను పనిచేసే దేశీయుల స్థితికూడా ఇలాగే వుండేది. నిజానికి ఈ శిరస్తాదారువుద్యోగం దేశీయులుపొందే హోదాలలోకెల్లా గౌరవకరమైనదీ, కొంచెం ఎక్కువజీతం కలట్టిదీ. అయినా 1845 కి పూర్వం పదేళ్ళలో ఉత్తరసర్కారులలో ప్రతిజిల్లాలోనూ కూడా శిరస్తాదారు లందరినీ ఏదో కారణముమీద పనిలోనుంచి తొలగించారు.

1842 లో విశాఖపట్నం జిల్లాకలెక్టరుగానూ, చెన్నపట్నం గవర్నరు ఏజంటుగానూ వుండిన పి.బి.స్మాలట్టుగారు (P.B.Smollet ) 1858 లో 'Madras and its civil administration' అనే పుస్తకంలో యీపరిస్థితుల నన్నింటినీ వర్ణిస్తూ ఆ జిల్లాలో తనకు పూర్వం పనిచేసిన కలక్టరు పోయి తాను వచ్చే లోపుగా తాత్కాలికంగా పనిచేసిన కలెక్టరుకింది సీనియరు అసిస్టెంటుదొర అక్కడి శిరస్తాదారుణ్ణీ, సగంమంది దేశీయోద్యోగులనూ పనిలోనుంచి తీసివేసిన సంగతిని వ్రాశారు.

కంభం నరసింగరావు గారు

ఈయన 1544-52 మధ్య రాజమహేంద్రవరంజిల్లా కలెక్టరు కచేరీలో శిరస్తాదారుగా వుండేవాడు. అప్పట్లో గోదావరిజిల్లాను రాజమహేంద్రవరంజిల్లా అనేవారు. ఆ కాలంలో చెన్నరాజధానిలో హెడ్డుశిరస్తాదారు అంటే కలెక్టరు దొరగారి దివాను అన్నమాట. రివిన్యూసిస్తువసూలు విషయాలలో అతడే కలెక్టరుకు ముఖ్య సలహాదారు. కలెక్టరు కచేరీలోనుంచి జారీఅయ్యే తాఖీదు లన్నింటిపైనా ఆయన చేవ్రాలు వుండాలి అతణ్ణి 'నేటివుకలెక్టరు ' అనేవారు.

నరసింగరావుగారు ఇంగ్లీషువర్తకకంపెనీ సర్కారు కొలువులో 27 సంవత్సరాలు పనిచేసి రెవిన్యూశాఖలో పెద్ద ఉద్యోగాలు చేసిన అనుభవజ్ఞుడు రాజమహేంద్రవరం జిల్లాపరిపాలన బాగా లేకపోవడం