పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

కథలు - గాథలు

వుండేది. అయితే వీళ్ల జీతం చాలా స్వల్పంగా వుండేది. ఇంగ్లాండులో ఒక బిళ్లబంట్రోతు కిచ్చే జీతమైనా లేదు. కలెక్టరుకు వీళ్లపైన సర్వాధికారాలు వుండెవి. చీటికీ మాటికీ వీళ్లని బదిలీచెయ్యడమూ, జుల్మానా వెయ్యడమూ, పనిలోనుండి తగ్గించడమూ, తీసివేయడమూ జరుగుతూ వుండేది. తెల్లవారిలో చాలా మందికి నల్లవాళ్లని చూస్తేనే అసహ్యం. తాశిల్ధారులను ఇలాగ అగౌరవంగా చూస్తూ వున్నందువల్ల ప్రజలకు వాళ్లమీద గౌరవం పోయి కొండెములు చెప్పడం ఎక్కువ అయింది. కలెక్టరులు ఆమాటలు విని తాశీల్దారులను కఠినంగా శిక్షిస్తూ వుండేవారు. తమ ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనె భయముతో వుంటూ జీతాలు చాలక, ఉద్యోగం వున్న నాలుగురోజులలో నాల్గుడబ్బులు సంపాదించుకుందామని కొందరు తాశిల్దారులు లంచాలు పుచ్చుకోనేవారు. తాశిల్దారు లందరూ లంచగొండులే ననే అభిప్రాయంతో కలెక్టర్లు అందరినీ కఠినంగా చూడడము ప్రారంబించారు.

ప్రతి తాశిల్దారు సత్ప్రవర్తనకు పూచీగా రెండువేల రూపాయలకు హామీ యివ్వాలని నిర్ణయించారు. తాశిల్దారులు తమకు ఆస్తి వున్న వూళ్ళలో వుద్యోగాలు చెయ్యకూడదన్నారు. అంతేగాని వాళ్ళ జీతాలను వృద్ధిపరచలేదు. వాళ్లగౌరవాన్ని కాపాడేటట్లు ప్రవర్తించనూలేదు. ఈస్థితిని కొంత చక్కపరచదలచి చెన్నపట్నం ప్రభుత్వం వారు 1235 లో తాశిల్దారులను చీటికీ మాటికీ శిక్షించి ప్రజల దృష్టిలో వాళ్ళ గౌరవానికి భంగం కలిగించవద్దనిన్నీ,వాళ్ళకు వుద్యోగాలు స్థిరములనే నమ్మకం కలిగించాలనిన్నీ కలెక్టర్లకు తాకీదులు జారీ చేశారు. ఈ సలహలిచ్చి పాతికేళ్లు దాటినా కలెక్టర్లు పూర్వంలాగానే నిరంకుశంగా ప్రఫర్తిస్తూ వచ్చారు. తాశీల్దారుల జీతాలు వృద్ధికాలేదు. విశాఖపట్నంలో 1856 ఆ ప్రాంతములలో ఇద్దరు తాశిల్దరులు తమకు నెల 1కి 10 నవరసులు జీతం యివ్వవలసిందని అర్జీపెట్టుకుంటే అప్పుడు జిల్లాకలెక్టరులపైన అధికారిగా వుండే ఉత్తర సర్కారుల కమిషనరు వాళ్ళకు నెల 1కి 8 సవరసులు జీతం చాలునని వుత్తర్వుచేశారు.