రాసాగి దర్శనమాత్రముచేతనే కామవికారములను పుట్టించే ప్రతిమలతోనున్న చిత్రములతోనున్ను దేవాలయములను కట్టసాగిరి. మరిన్ని సాధారణపు స్త్రీపురుషుల ధరించిన వికారవేషములతొనున్ను వికారచర్యలతోనున్ను బింబాలను అలంకరించ సాగిరి. మరిన్ని ఆగుడికంటే యీ గుడిలో విభవము యెక్కువ అనిపించవలెనని పై పోటీలతో వ్యర్ధముగా ద్రవ్యవ్యయముచేసి పయిన చెప్పిన పనికిమాలిన పనులు జరిగించి అలాటి అలంకార విభవముల గుండా లోకులకు భక్తిని కలగజేయ సంకల్పించినందున సర్వాంతర్యామియైన భగవంతునికి అది విరుద్ధముగా తోచినది. ఆ ప్రకారమే బ్రాంహ్మణులను సత్కర్మల నాచరింఫుచు లోకుల శ్రేయస్సును ప్రార్ధింపుచు అందరినిన్ని ఆశీర్వదింపుచు నుండునని చెప్పితే మేము సర్వోత్కృష్టులమని అహంకరించి ఇతరవర్గములను తృణీకరించ సాగిరి.
- * * * *
సగుణబ్రహ్మారాధన విషయమయి చిత్తము భక్తికలిగి తదేక నిష్ఠతో ఉండేకొరకు ధ్యానారంభకాలమునందు (148) యధోచితముగా తగుపాటి మత్తద్రవ్యమును సకృదానృత్తి పుచ్చుకొను మని పూర్వీకులు దోవచూపితే సారాయి పీపాయీలను ఖాళీచేయ సాగినారు. గోబ్రాహ్మణ పోషణ ప్రకటన మయ్యేకొరకై వారిపోషణ విషయమై అబద్ధమయినా ఆడవచ్చునని పూర్వీకులు వారిపక్షముగా వ్రాస్తే అబద్ధముతోనే జీవనము చేయసాగిరి. వృద్ధమాతా పితృపోషణ ముఖ్యమని తెలియ పరచను "అప్యకార్యశతం కృత్వా" అని మనువు వ్రాస్తే పరద్రవ్యమును పేలపిండివలెనే భుజింప సాగిరి. ఈ రీతిగా పూర్వీకులు కడతేరేటందుకు వేశిన మొలకలను విషధారలతో పెంచినందుచేత విషజ్వాలాసహితములైన ఫలములే ఫలించినవి. కలిలో భావిఫలములను పూర్వీకులు ఊహించినట్టు ఈ కర్మఠులు బహుమంచిది బహుమంచిది అనిచేసే పనులంతా యీశ్వరదృష్టికి అపరాధములుగా తోచి, ఈ విపరీతము లయిన ఆచారములనున్ను అర్చనల నున్ను బొత్తిగ నిలప దలచి యిప్పుడు ఈ బ్రహ్మాండములో యధోచితముగా పదవాక్య ప్రామాణ్యముగల యింగిలీషు వారిని యీ కర్మభూమిని యేలేటట్టు చేసినాడు." 500 పుటలు: వెల రు.2--8--0
వలయువారు:-- దిగవల్లి వేంకట శివరావు, బెజవాడ, అని వ్రాయుడు.ఏ.జి. ప్రెస్, బెజవాడ.