నూజివీటి వ్యవహారం
149
అప్పుడు చెన్నపట్నంలో సర్ తామస్ రంబోల్డు అనే ఆయన గవర్నరు. ఆయన కార్యాలోచన సంఘంలో వైటుహిల్లుగారు వృద్ధ సచివుడు(సీనియరు సభ్యుడు) అప్పారావుగారిమాట ఎవరూ వినిపించుకోలేదు. ఆయన నూజివీడుకు తిరిగివచ్చాడు.. కంపెనీవారి న్యాయంలో విశ్వాసం గోల్ఫోయి తిరుగుబాటు చేసే సూచనలు కనబరిచాడు.
కంపెనీఅధికారులు మేజర్ కసామేజరును నూజివీడు పంపి జమీందారును బందరు రప్పించి ఖైదుచేశారు. ఆయనను నిర్భంధంలో వుంచిన కారాగారాధికారి హాడ్జెసు. పైనచెప్పిన దొర లందరికీ అప్పారావుగా రివ్వవలసినట్లు చెప్పేబాకీ మొత్తానికి అప్పారావుగారి చేత హడ్జను ఒక పత్రం వ్రాయించుకున్నాడు!
ఈవైట్ హిల్లుసంగతి చెప్పాలంటే చాలాగాధ వుంది. ఈవైటుహిల్లూ ఇతనికి ముందుపని చేసిన ఫ్లాయిర్ (Floyer) క్రాఫర్డు దొరలు స్వలాభాపేక్షతో చాలా అక్రమాలు జరిగించి ప్రజలను పీడించారనిన్నీ అప్పుడు చెన్నపట్నంలో కొన్నాళ్ళు గవర్నరుగా పని చేసిన రంబోల్గుగారు వీరికి మద్ధతుచేశారినిన్నీ వీరందరూ కలిసి కంపెనీ వారి సొమ్ము హరించారనిన్నీ 1775లో కోరింగదగ్గర ఇంజరంలో కంపెనీ వారి ఏజంటుగా వుండిన శాడ్లియర్ గారు ఫిర్యాదుచేశాడు. కొన్నాళ్ళదాకా ఏమీ జరగలేదు. ఈలోపుగా వైటుహిల్లు, రంబోల్డుదొరల లంచగొండితనము దుష్ప్రవర్తనము మితిమీరినందువల్ల గవర్నరు జనరలు వీరిని 1781 లో పనిలోనుండి సస్పెండు ఛేశారు.
అప్పుడు చెన్నపట్నంలో పరిపాలక సంఘానికి శాడ్లియరు తాత్కాలికంగా ముఖ్యాధికారి అయినాడు. అప్పరావుగారు తనకు జరిగిన అన్యాయాన్ని గురించి యిచ్చుకున్న అర్జీని శాడ్లియరు పార్లమెంటుకు పంపించారు. అప్పుడు కంపినీడైరెక్టర్లకోర్డువారు దీనినిగురించి జాగ్రత్తగా విచారణజరిగించవలసినదని వుత్తర్వుచేశారు.
చెన్నపట్టాణానికి మెకార్ ట్నీ ప్రభువు గవర్నరైనాడు. ఇతడు సద్ధర్ముడు. నూజివీడుజమీందారుడి విషయంలో హాడ్జెసు జరిపిన