పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


బంలోనే కొన్ని తగాదాలు వచ్చినవి. తరువాత ముప్ఫయి నలభై సంవత్సరాలలో ఈ రాజ్యభాగం మహమ్మదీయులకు వశమై అరవీటి రాజవంశ పరిపాలన అంతరించింది.

      భట్టుమూర్తి రామరాజభూషణు డనే బిరుదును పొందిన తరువాత రచించిన "వసుచరిత్ర" మనే ఆంధ్రప్రబంధాన్ని రామరాయల తరువాత రాజ్యం చేసిన తిరుమల రాయలవారికి అంకితం యిచ్చాడు. 'నరసభూపాలీయ ' మనే అలంకార గ్రంధాన్ని రాయలవారి మేనల్లుడైన పొచిరాజు నరసరాజుగారికి కృతియిచ్చాడు.
     తెనాలి రామలింగకవి కృష్ణదేవరాయల ఆస్థానంలో వుండి కవిత్వం చెప్పినట్లుగాని, గ్రంధాలు రచించి నట్లుగాని నిదర్శనాలు కనబడడంలేదు. రాయలవారిని గురించి, తాతా చార్యులవరిని గురించి, సమకాలికులైన కవులన్ గురించీ అతడు చెప్పినట్లు ప్రచారంలోవున్న చాటుపద్యాలు కృష్ణదేవరాయల తరువాత రాజ్యంచేసిన  రాయలవార్లకుకూడా అన్వయిస్తున్నవి. కృష్ణదేవరాయల కాలం తరువాతనె అతను గొప్ప గ్రంధాలను రచించి రాజసమ్మానం పొందినట్లున్నూ., వేంకటపతిదేవరాయ మహారాయల కాలం వరకూ జీవించియున్నట్లున్నూ, రాయలవారి మెప్పుకోసం వైష్నవుడై తన పేరుకూదా రామకృష్ణకవి యని మార్చుకున్నట్లున్నూ, కనబడుతున్నది.
   కృష్ణదేవరాయలవారి తరువాత రాజ్యంచేసిన రాయలవార్లందరూకూడా సంగీతసాహిత్యాలను లలితకళలను పొషించి విద్యావ్యాసంగము చేస్తూరసజ్ఞలై సంస్కృతాందకఫులను ఆదరించి ఆంధ్ర భోజు లనిపించుకున్నవారే, ఈరాయలవార్ల రాజగురువుల పేర్లు కూడా తాతాచార్యులవార్లె, అనంతాచార్యుడు ప్రసన్నామృతంలో ఈ గురువుల వంశావళి కనబడుతున్నది. ఈ తాతాచార్యులవార్లకు అయ్యావయ్యంగా రనీ, ఎట్తూరు తాతాచార్యులు గారనీ, పంచమత భంజనం తాతాచార్యులనిన్నీ, కోటికన్యాదానం తాతాచార్యులనిన్నీ,