Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగలి కొండోజీ

143


ఈరామరాయలవారు మహమ్మదీయులతో చాలా యుద్ధాలు చేసి జయించిన మహావీరుడు, సంగీతసాహిత్యాలను చిత్రకళలను పోషించిన రసజ్ఞుడు. ఆయన చాలమంది సంస్కృతాంధ్రవిద్వాంసులను కవులను ఆదరించి బహుగ్రంధరచనను చేయించి భోజుడని ప్రఖ్యాతి చెందినట్లు సదాశివరాయలవారి శాసనాలలోనే వుదాహరింపబడి యున్నది. తరువాత వసుచరిత్రను రామరాయలవారి తమ్ముడైన తిరుమలరాయల కంకిత మిచ్చిన భట్టుమూర్తి రామరాయలవారి ఆస్థానకవిగా నుండి సమ్మానింపబడి "రామరాజభూషణు" డనే బిరుదును పొందినాడు.

రామరాయలవారి కాలంలో రాజగురువుపేరు తాతాచార్యులే ఆయన పంచమతభంజన మనే గ్రంధాన్ని వ్రాసి "పంచమతభంజనం" తాతాచార్యులవా రనే బిరుదును వహించాడు. కృష్ణదేవరాయల వారి కాలంనాటి కవులు, గాయకులు, విద్వాంసులు, సామంతులు, సరదారులు అనేకులు రామరాయలవారి కాలంనాటికి కూడా బ్రతికి వుండి రాజసభలో వున్నట్లు తెలుస్తున్నది.

రామరాయల చేతులలో ఓడిపోయిన మహమ్మదీయరాజు లందరూ ఏకమై 1565 లో విద్యానగరంమీదికి దండెత్తి రాగా తాలికోట యనే 'రాక్షస తగ్డి ' యుద్ధం జరిగింది. అందులో రామరాయలవారు స్వర్గస్తులైనారు. అంతట ఆయన తమ్ముడైన తిరుమల రాయలవారు ధనకనకవస్తువాహనాలను తీసుకుని సదాశివరాయల వారితో విద్యానగరం వదలిపెట్టి పెనుగొండను రాజధానిగా చేసుకొని రాజ్యపరిపాలన మారంభించారు. విద్యానగరాన్ని మహమ్మదీయులు నాశనం ఛేశారు 1569 లో సదాశివరాయలవారు చనిపోగా అరవీటి తిరుమల రాయలవారే చక్రవర్తియై 1572 వరకూ పరిపాలించారు వారి తరువాత ఆయన కొమాళ్లలో శ్రీరంగరాయలవారు 15895 వరకున్నూ వేంకటపతి దేవరాయ మహారాయలవారు 1614 వరకున్నూ, చంద్రగిరి రాజధానిగా చేసుకుని విద్యానగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వేంకటపతి దేవరాయలవారి తరువాత కుటుం