పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కందనూరు నవాబు రాజరికం

137


నుంచి అరబ్బీదూతలు బయలుదేరి దేశంలో నలుమూలలా తిరుగుబాటు చేయడానికి ప్రచారం చేశారు. ఆసమయంలో భగవంతుడి సహాయం ఇంగ్లీషువారికి వుండబట్టిగాని లేకపోతే హిందూ దేశంలో వారి రాజ్యం భగ్నం అయ్యేదే. ఆఖరికి జాతివాళ్ళు చాలామంది ఆహుతి అయ్యెవారే. ఈకుట్రాలోచనలు జరిగినట్లు చాలా దాఖలాలున్నాయి.


ఇలాంటి అరబ్బీదూతలు కొంతమంది చెన్నపట్నందగ్గరనే పట్టుబడ్డారు. ఆసమయంలో వారిదగ్గర దొరికిన రక్షరేకులలో పైకికేవలమూ మహమ్మదీయ మతానికి సంబంధించిన ఖురానులోని సామాన్యపదాలుగా కనబడే మాటలే చిత్రంగా కూర్చబడి, వాటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కాఫరులపైన జిహాద్ అనే మతయుద్దానికి తురకలను పురిగొలిపే అర్ధం స్ఫురిస్తుంది. ఈమాటలను తురకంలోలాగనే కుడినుంచి యెడమకు చదవాలి. ముఖ్యంగా ఈకింది పట్టికలోని గళ్లలో నాలుగైదు పంక్తులను ఇలాగ చదివి చూడండి:-

6 5 4 3 2 1
తొలగించు పీడను మాప్రజలకూ మాకూ కరుణామయుడా ఓ దేవా(1)
నాశనం చెయ్యడు మరెవ్వరినీ గట్టి కోటగోడల మధ్య ఉన్నవారిని తప్ప రక్షిస్తాడు సద్ధర్ములను భగవంతుడు(2)
రక్షించు మమ్ములను నీ సేవకులైన పంపి నీ ప్రవక్తను ఓ భగవంతుడా (3)
వెయ్యి తరిమి దుష్పరిపాలకుల్ని ఈ క్రూర నిరంకుశ ఈ మహానగరాల నుండి ఓ ప్రవక్తా(4)
నాశనం చెయ్యి వారిని ఓ భగవంతుడా యుద్ధం చెయ్యండి నాస్తికులపైన కాఫరుల పైన(5)

కర్నూలు నవాబు కుట్ర

ఆఫ్ఘనిస్థానములో ఇంగ్లీషుసైన్యాలకు జయం కలుగుతుందో అపజయమే కలుగుతుందో అనే సందిగ్ధావస్థలోనున్న సమయంలో అనగా 1839- వ సంవత్సరంలో ఒకబీదతురక స్త్రీ హైదరా