పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


వారికి తెలిసినందువల్ల ఆయనను హైదరాబాదులోనుంచి దూరప్రదేశానికి ప్రవాసం పంపించారు.

   ఈదేశపు మహమ్మదీయులలో స్వమతాభిమానం చాలా ఎక్కువ. పరమతసహిష్ణుత చాలా తక్కువ. తమకు యిష్టంలేని రాజ్యాంగవ్యవస్థపట్ల తమవారిలో విరోధభావం వ్యాపింపచెయ్యడానికి అవకాశంకోసం చూస్తూవుండడము మొదటినుంచీ వుంటూనేయున్నది. దేశేయులలో ఒకరితో ఒకరు రహస్యంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి ఈదేశంలోచాలా అవకాశాలు వుంటూవున్నందువల్ల రహస్యాలోచనలకూ, కుట్రలకూ చాలా వీలుగా వుంటూవుండేది. రహస్యపు ఉత్తరప్రత్యుత్తరాలమార్గంగానూ, బజారు పుకారుల మూలంగానూ అనేక వార్తలు ఈదేశంలో ఆనోటా ఆనొటాపడి చాలా త్వరగా వ్యాపిస్తూవుండేవి. 

తురకల రక్షరేకులు, తాయత్తులు

  ప్రపంచ మంతా మహమ్మదీయులకు తావేదులన్నా, రక్షరేకులన్నా చాలా ప్రీతి. ఈ తాయత్తులలో కాగితాలపైనా, రక్షరేకులపైనా భగవంతుది పేరో, లేకపోతే ఖురానులోనుంచి ఒక వాక్యమో వ్రాసి వుంటుంది. అయితే అందులోని అక్షరాలూ, మాటలూ, వాక్యాలూ, పైకి కనబడేఅర్ధాన్నేకాక వేరే ఇంకొక అంతరార్ధాన్నికూడా స్ఫుతింపచేస్రూ వుండేటట్లు వ్ర్రాయడానికి వీలున్నందువల్ల హిందువులపైననూ,వారిలాగనే కాఫరులైన ఫరంగీర్లపైననూ ద్వేషాన్ని పుగొల్పే 'జిహాద్ ' అనే మతయుద్ధాన్ని ప్రకటించడానికి ఉపయేగించేవారు.

'జిహాద్ ' అనే మతయుద్ధం

  1232 లో ఇంగ్లీషువారు ఆప్ఘనిస్థానం మీదికి దండయాత్ర చెయ్యడానికి సైన్యాలు పంపినప్పుడు ఇలాంటి అర్ధాలు స్పురించే తాయత్తులూ, రక్షరేకులూ దేశంలో చాలాచోట్ల కనబడ్డాయి. ఆ సమయములో హిందూదేశ మంతటావున్న మహమ్మదీయ ప్రజలలో రహస్యమైన ఉద్రేకం కలిగినట్లు కనబదింది. అయోధ్యరాష్ట్రంలో