పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కందనూరు నవాబు రాజరికం

181


ఏకారణంవల్లనో అతనికి బదులుగా కొంతకాలం మునవరుఖానున్నూ, తరువత ముజఫర్ ఖానున్నూ నవాబులుగ నున్నారు. ఇంతలో ఆలూఫ్ ఖాను 1815 లో చనిపోగా ఇంగ్లీషు ప్రభుత్వంవారు ముజఫర్ ఖానును తొలగించి మళ్ళీ మునవరుఖానునే నవాబుగా చేశారు.

గులాం రసూలుఖాను పరిపాలన

మునవరుఖారు నవాబుగా వుండగా 1816 లో పిండారీ దండు కర్నూలుజిల్లామీదికి వచ్చిపడి ప్రజలను దోచి హింసించింది. మునవరుఖాను తరువాత 1823 లో గులాంరసూలుఖాను కర్నూలు నవాబు అయినాడు. ఇతడు 1839 వ సంవత్సరం వరకూ ఆ రాజ్యాన్ని ఏలినాడు. ఇతని కాలంలో పరిపాలన చాలా నిరంకుశంగా వుండేది. ఈయనరాజ్యంలో వున్న అహోబలం, శ్రీశైలం, మొదలైన పుణ్యక్షేత్రాలకు యాత్రవచ్చే హిందువులవల్ల చాలా ఎక్కువ హాశ్శీలు వసూలు చేస్తూవుండేవాడు గాని ఆ దేవస్థానాల పరిపాలన సరిగా జరిగించేవాడు కాదు.

గులాం రసూలుఖానుగారికి పూర్వం కర్నూలును పరిపాలించిన నవాబులలో కొందరు చాలా శాంతముగాను న్యాయముగాను దేశాన్ని పరిపాలించారు. దేశం సుభిక్షంగా నుండేది. వారు మతపక్షపాతం చూపించకపో వడమేగాక హిందువుల దేవాలయాలను కూడా ఇనాములిచ్చి పోషించారు. కర్నూలు నవాబులు నిజాముగారి కివ్వవలసిన పేష్కషు గాకుండా వారు నిజాముగారికీ ఇంగ్లీషు కంపెనీ వారికి చాలా సొమ్మును సైన్యమునుఇచ్చి యుధ్దాలలో సహాయంచేయవలసి వచ్చేది. ఒక వంక హైదరాలీ సైన్యాలూ, ఇంకొకవంక శివాజీ సైన్యాలూ, వచ్చిపడి దేశాన్ని కొల్లగొట్టి నవాబును బాధిస్తూ వున్నందువల్ల నవాబుకు అమితమైన ధనవ్యయం కలిగి చాలా సొమ్ము కావలసి వచ్చేది. అందువల్ల వారు ప్రజలను పీడించి అనేక విధాలుగా సొమ్ము రాబట్టే వారు. పన్నుల వసూలులో క్రమపద్దతిపోయి గ్రామాధికారులే పన్నులు నిర్ణయించి వసూలుచేసే పద్ధతి ప్రారంభమైనది.

గులాం రసూలుఖానుగారి కాలంలో గ్రామాలను గుత్తకిచ్చే