పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వాకిటి కావలి తిమ్మన

125


పొరపాటునైనా చెప్పవు. కావేటిరంగని పదాలుగాని, పాండురంగవిఠలుని కీర్తనలు గాని, తుకారాము అభంగములుగాని, కబీరుదాసు కీర్తనలుగాని, తులసీదాసు తొహరాలుగాని, గీతగోవిందముగాని, తరంగములుగాని, తత్వాలుగాని ఎక్కడనైనా ఎవరైనా పాడుతూవుంటే అది ఏభాష అనే విచక్షణ లేకుండా దేశప్రజలందరూ-- స్త్రీలూ, పురుషులూ భక్తిపారవశ్యంతో తన్మయు లవుతారు. ఏక్షేత్రానికి పోయినా ఆప్రాంతపు భాషతో నిమిత్తం లేకుండా అక్కడి ప్రజలతో పాటు దేవుణ్ణి సేవించగల్గుతున్నారు.

అరవలైన పల్లవులూ, చోళులూ తెలుగుదేశాన్ని ఏలినప్పుడు గాని, చాళుక్యులు తెలుగుకర్ణాటకాలను ఏలినప్పుడుగాని, కర్ణాటక రాజ్యమధ్యలో తెలుగుప్రభుత్వము స్థాపించిన విజయనగరచక్రవర్తులు ద్రావిడ కర్ణాటకాలను పరిపాలించినప్పుడుగాని, ఒకజాతిని ఒక బాషను అధికముగా జేసి తక్కినవారిని అణగద్రొక్క లేదు. అన్నిభాషలనూ ఆదరించారు. "జనని సంస్కృతంబు సకలభాషలకును, దేశాభాషలందు దెనుగు లెస్స" యనే భావము ఒక్క తెలుగువారిలోనే కాదు అరవల లోనూ కన్నడులలోనూకూడా వ్యాపించి యున్నది. ఆయాదేశాలలో ఇప్పటికీ ప్రజల నోట వినబడే తెలుగుపదాలు, పద్యాలు, కీర్తనలు, కధలు, గాధలూ ఇందుకు ప్రబలమైన నిదర్శనాలుగ ఉన్నాయి. కృష్ణదేవరాయలంతటివాడు "దేశభాషలందు తెలుగు లెస్స"యని యుద్ఘోషించాడు. అంతమాత్రంచేత జాత్యహంకరముగాని, జాతి వైరముకాని ప్రబలలేదు.

ద్రావిడ ఉద్యమము

అరవదేశంలో ఇటీవల కొందరు ప్రబుద్ధులు బయలుదేరి ఒక ద్రావిడాభిమానమును ప్రచారంచేస్తూ తమదేశములోనుంచీ, భాషలోనుంచీ, సంగీత సాహిత్యములలోనుంచీ సంస్కృతాన్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తున్నారు! అరవంలో పాడకుండా తెనుగులో పాడినాడనే కారణంతో త్యాగరాజుయొక్క దివ్యవాణిని తమ సంగీతసభలలో