పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


రంగధామమును గరంబు సన్నుతి గాంచు
గ్రహములందు శశియు రవియుబోలె."

అని 4 వ ఆశ్వాసంలో వ్రాసినాడు. (చూ: శబ్దరత్నాకరము)

         తెలుగులో తిరుపతి తిరుమల లనే పదాలు పర్యాయపదాలుగా చిరకాలంనుంచి వాడుకలో నున్నవి. తెలుగు, దేశానికీ, అరవదేశానికీ తిరుపతి కొంద సరిహద్దని అంటారు.  తిరుపతిలోని ప్రజలందరికీ తెలుగే మాతృభాషగా వుండి తిరుమలలోనుంచి తిమ్మడనే పేరు రూఢమైంది. ఈ తిరుపతి వెంకటేశ్వరుడు తెలుగువారికి ఇలవేల్పుగా వుంటున్నాడు. అయితే ఇటీవల దావిడాభిమానుల యుద్యమ మొదటి బయలుదేసిన్ తిరుపతి వేంకటేశ్వరుడు పేరులొని వేంకటశబ్దము వేంగడ మనే అరవ శబ్ధంలో నుంచి పుట్టినదనీ, దానితో పాటు తిరుమల తిరుపతులు కూడా అరవవారి స్వార్జితపుసొత్తులనీ ఒక ప్రచారము జరుగుతూ వున్నది.

"జననీ సంస్కృతంబు సకలబాషలకును, దేశభాషలకు తెలుగు లెస్స"

  మన దక్షిణభారతదేశఉలో పూర్వంనుంచీ ఏరాజవంశాలు ఏలుతూవస్తూవున్నా, వారు పల్లవులైనా, చోళులైనా, చాళుక్యులైనా, లేక కాకతీయులైనా, విజయనగరచక్రవర్తులైనా ఇక్కడి తెలుగువారినీ, అరవవారినీ, కన్నడులనూ కూడగట్టుకుని దేశప్రజలు, నాగరికతను, మతమర్యాదలను కాపాదుతూ ప్రజారంజకంగా పరిపాలించేరేగాని వేరువేరు భాషలు మాట్లాడేవారని చీలదీసి 'పాకిస్తానల 'ను ఏర్పరచలేదు. అందువల్లనె ఆసేతుహిమాచలపర్యంతముగల పుణ్యక్షేత్రాలను, పుణ్య్హనదులను దేశప్రజలందరూ ఇప్పటికీ అమాన భక్తితోనే పూజిస్తూవుండడం తటస్థించింది. ఏ క్షేత్రమాహత్మ్యం చదివినా, ఏ పురాణం చదివినా ఆస్థలజలపవిత్రతను గురించీ, ప్రాశస్త్యాన్ని గురించీ వర్ణించడం కనబడుతుండేగాని ఇది అరవలది, అది తెలుగువారిది, ఇద్ కన్నడులది, అది మహారాష్ట్రులదె, అనె భేదాన్ని