పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వాకిటి కావలి తిమ్మన

117

భృత్యులుకూడా సత్కులసంజాతులైన ప్రభువులుగానే వుంటూ వున్న సంగతి ఇంగ్లీషు రాజ్యాంగ చరిత్రను చదివినవారందరికీ తెలుసును. ఇలాంటి రాజసేవకుల లో 'లార్డుచేంబర్లేన్ ' అనే హోదాగల ఉద్యోగి అధికారమునుబట్టీ, గౌరవమునుబట్టీ, పలుకుబడినిబట్టీ చాలా గొప్పవాడు. ఇతను ఒక ముఖ్యమైన ప్రభువుగా వుంటాడు. ప్రీవీకవున్సిల్ అనే రాజుగాని అంతరంగిక కార్యాలోచన సభలో సభ్యుడుగా వుంటాడు. రాజుగారి కుటుంబములో తటస్థించే శుబాశుభాల కన్నింటికీ ఇతడు తగిన ఏర్పాట్లు చేస్తాడు. రాజుగారి దర్శనము చేయదలచిన వారందరూ ఇతనిని ఆశ్రయించాలి. రాజుగారి దర్శనము చేయతగినవారని తనకు తోచినవారి కతడు ఆహ్వానాలు పంపిస్తాడు. అతడు ఎల్లప్పుడూ రాజుగారి ప్రక్కనే నిలిచియుంటాడు. రాజుగారు రాజభవనంలోనుంచి బయటికి వెళ్లునప్పుడు బండిదగ్గరనుంచి లోపలిదాకా మార్గం చూపుతూ తీసుకొనివస్తాడు. రాజ దర్శనం కోసం వచ్చినవారిని రాజుగారికి ఎఱుకరుస్తాడు. రాజుగారి ఆలోచనమందిరము, శయనమందిరం ఈ చేంబర్లేన్ గారి తనిఖీక్రిందనే వుంటాయి. ఈయనక్రింద వైస్ చేంబర్లేన్ అనే సహాయోద్యోగి యొకడు వుంటాడు. ఇతనిక్రింది మాస్టర్, మార్షల్, మార్షల ఆఫ్ సెరిమొనీస్ మొదలైన ఇతరరాజ సేవకులు పనిచేస్తారు. రాజుగారికి సాలుపొడుగునా సేవచేడానికి 'Lords and grooms in waiting ' అనే హోదాగల ఆరుగురు ప్రభువులను నియమిస్తారు. వారొక్కొక్కరు పదిహెను రోజులుగాని, 21 రొజులుగాని వంతులుచొప్పున రాజసేవ చేస్తారు. ఇంకా ఇలాంటి సన్నిహితభృత్యులు, గౌరవహోదాలవారు చాలామంది వున్నారు.

ఇంగ్లీషు రాణీగారి అంత:పురముకూడా లార్డుచేంబర్లేన్ గారి అధికారంక్రిందనే వుంటుంది. రాణీగారి సేవకోసం ఇంగ్లాండు దేశంలో చాలా గొప్ప వంశాలలో జన్మించిన ప్రభువుల భార్యలు, వారి కొమర్తెలు, కోడళ్లు, మనుమరాండ్రు 'Ladies of the bed chamber, Women of the chamber, Maids of honour' అనే