116
కథలు - గాథలు
కు సరియైన అంగీరసనామ సంవత్సరం (క్రీ.శ.7-8-1512)నాటి శాసనములో ఈ కుటుంబంవారికి తిరువెంగళ నాధుడు ఇలువేల్పు అయినట్లున్నూ, అవసరం నరసయ్య తిమ్మయ్యగార్లు "రాయరబాగిల అవనరద".అనగా కృష్ణదేవరాయల వారి తలుపుల దగ్గవుండే ద్వారపాలకు లైనట్లున్నూ కన్నడంలో వివరింప బడింది. ఈ అన్నదమ్ములలొ తిమ్మయ్యయే మన 'వాకిటికావలి ' తిమ్మన యని నిస్సందేహంగా చెప్పవచ్చును.
ద్వారపాలకు డంటే మన 'గేటుకీపరు ' వంటి జవాను అనుకోకూడదు. అతడు రాయలవారి సన్నిధిలో నుండే ఒక గొప్పయుద్యోగి. రాయలవారి దర్శనం నిమిత్తం పోదలచినవారందరూ ఆయన అనుజ్ఞను పొందాలి. అతడు రాయలవారికి మనవిచేసి దర్శన మిప్పిస్తాడు. అందువల్ల ఆయనకు దివాణంలో గొప్ప అధికారము, పలుకుబడి వుండేవి.
శా.శ.1441 ప్రమాదినామ సంవత్సరం అనగా క్రీ.శ.1519-20 నాటి శాసనంలో పేర్కొనబడిన కృష్ణదేవరాయలవారి ద్వారపాలకుడైన 'తిమ్మభూపతి ' యీ వాకిటి కావలి తిమ్మన్నగారే. ఈ శాసనంలో 'భూప ' అనేపదము వాడినందువల్ల ఇతడు కొంత రాజ్యభాగమును పరిపాలించే సామంత మండలేశ్వరుడని తేలుచున్నది. ఈ శాసనంలో మధురజిల్లాలో అన్నామల పేర్కొనబడినందువల్ల అతని రాజ్యభాగం ఆ ప్రాంతాలలో వుండివుండాలి.
ఇలాగే చక్రవర్తిగారికి ఇతర విధాలైన సేవలు చేసేవారిలో గొప్ప ప్రభువులు, దండనాయకులు అనేకు లుండినట్లు శాసనాలవల్ల కనబడుతూవుంది. రాయలవారి సన్నిహితభృత్యులలో కొందరు గొప్ప వంశాలలో జన్మించిన వారున్ను, కొందరు రాజబంధువులున్ను వుండే వారు. వారిలో కొందరు దుర్గాధ్యక్షులున్ను, సామంత మండలేశ్వరులున్నూ కూడా వున్నారు.
"లార్డు చేంబర్లేన్" వంటి రాజసేవకుడు
మనదేశాన్ని పూర్వం ఏలిన చక్రవర్తుల దగ్గరనుండే రాజసేవకుల లాగనే ఇంగ్లీషురాజుగారి దగ్గరనుండే సన్నిహిత