114
కథలు - గాథలు
అతనిని మందలించి రాయలవారు పెద్దనాదికవులను మళ్ళీ రాయలవారి సభకు రావించి గౌరవించారట.
ఈ గాధను పెద్దనకవి జీవితచరిత్రలో వుదాహరిస్తూ శ్రీ గురజాడ శ్రీ రామమూర్తి గారు ఆ పద్యంలో 'వాకిలి కావలి ' తిమ్మన యని పేర్కొనబడిన యతడు ముక్కు తిమ్మనయని పొరబాటుగా వ్రాశారు. అయితే వారే తెనాలి రామకృష్ణకవి జీవితంలో ఈ తిమ్మన్నను గురించిన ఇంకొక చాటుపద్యాన్ని ఉదాహరించి దాని గాధను వ్రాస్తూ అతడు కృష్ణదేవరాయలవారి వాకిటి కావలిగా నుండిన తిమ్మన్న యనే దండనాయకుడని సరిగానే వ్రాశారు. ఆ రెండవ గాధ యిది: ఒకమాటు కృష్ణరాయలవారు తమ వాకిట కావలిగా నుండే తిమ్మన్న యనే దండనాధుడి శౌర్యవిశేషానికి సంతోషించి అతని కొక అమూల్యమైన పచ్చడము (సేలువు) ను బహుమతి యిచ్చారట. అతడా పచ్చడము బుజాన వేసుకొని తన యింటికివచ్చి అరుగుమీద కూర్చునివుండగా అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, భట్తుమూర్తి, తెనాలి రామలింగకవి అదారిని పోతూ తిమ్మన్న గారిని చూసి ఆయనను అభినందిస్తూ నలుగురూ కలిసి ఒక కందపద్యంలో నాలుగు పాదాలు వరసగా ఇలాగ పూర్తిచేశారట:
"వాకిటి కావలి తిమ్మా (అల్లసాని పెద్దన)
ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా (ముక్కు తిమ్మన)
నీకీ పద్దెమె కొమ్మా (భట్టుమూర్తి)
నా కా పచ్చడమె చాలు నయముగ నిమ్మా"--
(తెనాలి రామలింగ కవి)
అంతట పద్యంచివర భావప్రకటనము చేసిన రామలింగకవికి తిమ్మన్నగారు తన పచ్చడం యిచ్చివేసి తక్కినవారికి ఇతర బహుమానము లిచ్చి పంపించి నాడట.
తిమ్మన్నచరిత్రకు ఆధారాలు
ఈ రెండు గాధలూ సమన్యయం చేసి చూస్తే ఈ పద్యాలలొ చెప్పబడిన వాకిటికావలి తిమ్మన్నయనే యతడు సామాన్యుడైన