Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపట్నం గవర్నరు దుర్గతి

101

ఆయన మనస్సును మార్చాలని జపతపాలు హోమాలు చేయించాడు. అతనిని తుదముట్టించాలని మారణహోమంకూడా చేయించాడు.,

పిగట్టుగారు తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి స్యయంగా తంజావూరు వెళ్ళి అక్కడ ఆర్కాటునవాబుగారి పరిపాలన రద్దుచేయబడి మళ్ళీ తంజావూరు రాజుగారి పరిపాలన స్థాపించబడిందని ప్రకటన చేయించాడు.

బె న్ ఫీ ల్డు క ధ

ఆసమయంలో ఒక చిత్రం జరిగింది. 1763 వ సంవత్సరం నుంచి చెన్నపట్నంలో కంపెనీవారి ఇంజనీరింగు కట్టడముల శాఖలో ఒక చిన్న వుద్యోగి గా నుంటూ చెన్నపట్నం కోట గోడల నిర్మాణం వగైరా పనులు చేయించిన 'పాల్ బెన్ ఫీల్డు ' అనే దొర ఒకడు గవర్నరుగారి దగ్గరికివచ్చి ఆర్కాటునవాబుగారు తనకు 230000 సవరసూ బాకీ వున్నాడనినీ అందుకింద తంజావూరు రాజ్యంలో కొన్ని భాగాలను తనకు తాకట్టు పెట్టినాడనిన్నీతంజావూరు రాజ్యంలో శిస్తులు వసూలుచేసుకునే హక్కు తనకు వున్నదనిన్నీ తంజావూరులో కొందరు ఆసాములుకూడా తనకు బాకీవుండి భూములమీద పైరునుతనకు హామీ వుంచి నారనిన్నీ అభ్యంతరం చెప్పాడు. గవర్నరుగారు అతని మాటి వినిపించు కోకుండా తంజావూరును రాజుగారికి స్వాధీనపరిచారు. అంతట బెన్ ఫీల్టు చెన్నపట్నంలో గవర్నరు గారి కార్యాలోచన సభవారికి పైసంగతులతో అర్జీయిచ్చినాడు. బెన్ ఫీల్డు మాటలు చాలా ఆశ్చర్యంగానూ అనుమనాస్పదంగానూ కనబడినవి. ఇతరులకు అంత అప్పులిచ్చే తాహతు అతనికిలేదు. ఇతడు స్వతహాగా ధనవంతుడు కాడు. ఇంగ్లాండు నుంచి వచ్చినప్పుడు ఇతను తెచ్చిన సొమ్ము ఏమీలేదు. పోనీ, ఉద్యోగంలో ఎక్కువగా సొమ్ము ఆర్జించినాడేమోననుకుందా మంటే అతడు చేసిన వుద్యోగం చాలా చిన్నది. అందులో ఎక్కువగా సొమ్ము ఆర్జించే అవకాశాలు లేవు. ఇతడు తాను సంపాదించిన దానినే పొదుపు చేసుకుని కూడబెట్టు కున్నాడేమో నను