పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపట్నం గవర్నరు దుర్గతి

9

మొరపెట్టుకొన్నాడు. ఇంగ్లీషుకంపెనీవారు వీరిద్దరి మధ్యను రాజీ కుదర్చడంలో తమకు కొంత లాభం వున్నదని గ్రహించి అందుకు తగిన ఏర్పాటు చేశారు. తంజావూరు రాజు ఆర్కాటు నవాబుకు సామంతుడిగానుండి ఆయనకు నాలుగులక్షలవరహాలు కప్పం చెల్లించే టట్లున్నూ, నవాబు తంజావూరు రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించకుండా వుండేటట్లున్నూ 1762 లో ఒక రాజీ కుదిర్చారు. ఈ ఏర్పాటు ప్రకారం కొంతకాలం జరిగింది. ఇంతలో ప్రతాపసింహ మహారాజు చనిపొయాడు. అంతట కర్నాటక నవాబు తన బాకీదారు లైన ఇంగ్లీషుధికారుల కుట్రతో మళ్లీ ఎప్పటి ఆటనె సాగించాడు. ప్రతాపసింహుడి కొమారుడైన తులజాజీమహారాజు మీదికి నవాబు 1771 లో తనసైన్యాలను పంపించి రాజ్యాన్ని కొల్లగొట్టించాడు. తులజాజీమహారాజు ఏమీ చెయ్యలేక నవాబుకి చాలా సొమ్ము నిచ్చి అతనితో రాజీపడ్డాడు. ఇంగ్లీషువారు చూస్తూ వూరుకున్నారు.

కర్నాటకనవాబు ఆశకిమితిలేదు. తంజావూరు రాజ్యాన్నెలాగునైనా కాజెయ్యాలని సంకల్పించాడు. ఇందులో తనకు సహాయంచేస్తే అమితమైన ధన మిస్తానని ఇంగ్లీషుదొరలందఱికీ ఆశపెట్టాడు. చాలా మంది అధికారులను లోబర్చుకొన్నాడు. 1773 లో మళ్లీ తంజాఫూరు మీదికి దండేత్తి దేశాన్ని కొల్లగొట్టి రాజును చెరబట్టి రాజ్యాన్ని తనవశంచేసుకొన్నాడు. అంతట నవాబుచుట్టూ చేరిన ఇంగ్లీషు దళారీల పంటపండింది. ఋణాలతీర్మానం పేరున తంజావూరు రాజ్యభాగాలను నవాబువల్ల తాకట్టుపెట్టించుకొని శిస్తులు వసూలు చేసుకొనే హక్కును పొంది అక్కడ రైతుల పొలాలలో నున్న పంటయావత్తు జప్తుచేసి నానా భీభత్సమూ చెయ్యడం ప్రారంభించారు. ఇలాగ నవాబు తన బాకీదారులను తంజావూరుమీదికి ఉసికొల్పడం చూస్తే నిజంగా వీరందఱికీ బాకీలు లేవనిన్ని, తంజావూరును దోచుకొని ప్రజలను పీల్చిపిప్పిచేసి సొమ్ము పిండి ఉభయులూ కలిసి పంచుకోవడానికి నవాబున్నూ, ఈ దొరలున్నూ, కలిసి కుట్రచేశారనిన్నీ చాలమందికి తోచింది. ఋణదాతలలో చాలామంది కంపెనీ అధికారులుగానే