చెన్నపట్నం గవర్నరు దుర్గతి
97
వున్న ఆర్కాటునవాబు చుట్టుప్రక్కల నున్న రాజ్యాలలో దేని నైనా చేజిక్కించుకొని తనకు కావలసినసొమ్ము సంపాదించు కోవాలని ఆలోచిస్తున్నాడు. ఈవిషయంలో తన ఋణదాతలైన కంఫెనీ అధికారులూ, దొరలూకూడా తనకు సహాయము చేస్తారని అతని ఆశ. త్వరలోనే నవాబుకి అలాంటి అవకాశాలు లభించాయి.
ఆర్కాటునవాబు బాకీల వ్యవహారంలోనుంచి ఒక అధర్మదేవత తలెయెత్తి తంజావూరురాజ్యాన్ని పట్టుకొని ఓడించసాగింది. తంజావూరు సకల సంపదలకూ నిలయమైన స్వతంత్రరాజ్యం. అది పూర్వము చోళరాజుల క్రిందనుంది 14 వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజ్యమై తరువాత రాజ ప్రతినిధులైన తెలుగు నాయకులు పరిపాలనమున నుంటూ వచ్చింది. మఱికొంత కాలానికి తెలుగునాయకులు స్వతంత్రురాజులై ఆ దేశాన్ని పరిపాలించారు. తంజావూరు, మధురనాయకులమధ్య 1673 లో జరిగిన యుద్ధంలో మధురనాయకులు తంజావూరును జయింపగా ఆంధ్రనాయక రాజవంశం అంతరించినది. చత్రపతి శివాజిమహారాజు సవతి తమ్ముడైన ఏకోజి అనే 'వెంకోజీ ' బిజాపూరు సుల్తానుగారి సేనాపతిగా వచ్చి రాజాక్రమణచేసి 1675 లో తంజావూరుకు రాజైనాడు. తరువాత మహరాష్ట్రులైన ఆయనవంశీకులే ఆరాజ్యాన్ని పరిపాలించారు. ఇలాగ ఇక్కడ రాజులు మారినా దేశపరిస్థితులు మాత్రం మారలేదు. తంజావూరు ఎప్పటిలాగనే పాడిపంటలతో తులతూగుతూ సుభిక్షంగా నుండి సంగీత సాహిత్యాలకు, లలితకళకు ప్రసిద్ధిజెంది స్వతంత్రమైన దక్షిణాంధ్ర రాజ్యంగా ఉంటూవచ్చింది. ఈ తంజావూరు రాజ్య వైభవం చూస్తే చుట్టు పక్కల వారందఱికీ కళ్లు కుట్టినవి.
1742 లో తంజావూరునేలే సాహుజీని ప్రతాపసింహుడు త్రొసిరాజన్నాడు. అప్పట్లో చెన్నపట్నం సముద్రతీరంలో ఒకకోట కట్టుకొని వర్తకం చేసుకోంటూవున్న ఇంగ్లీషువారు ప్రతాపసింహ మహారాజుతో స్నేహం చేసి ఏడు సంవత్సరాలు ఆయనతో సఖ్యతగా నున్నారు. ఆకాలంలో ఇంగ్లీషు వారికీ, ఫ్రెంచివారికీ జరిగిన యుద్ధాలలో ప్రతాప