Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కథలు గాథలు

ఫీల్డున్నూ అతనిలాగనే భారతదేశంలో చాలా అన్యాయాలు చేసి అమితధన మార్జించి పార్లమెంటు సభ్యుడైన అట్కిన్ సన్ అనే దొరయున్నూ మరికొందఱున్నూ ఏకమై బర్కుమహాశయుని తీర్మానాన్ని ఓడించివేశారు. అంతట ఆర్కాటునవాబుగారి ఋణదాతల అక్రమచర్యలను హద్దుపద్దు లేకుండా పోయింది. ఈబాకీని 1784 మొదలు 1804 వరకూ సాలు ఒకటింటికి 480000 సవరసుల చొప్పున కిస్తీలుగా చెల్లించేటట్లు ఏర్పాటుచేశారు. ఇంత సొమ్ము చెల్లించిన తరువాత 1805 లో ఈ బాకీలను విమర్శించ డానికని ఒక విచారణ సంఘాన్ని ఏర్పర్చగా వారు 1814 వరకూ విచారించి రెండుకోట్ల సవరసులు బాకీ మొత్తంలో ఒకకోటి తొంబైలక్షల సవసరుల బాకీ కేవలమూ అబద్ధమని నిర్ణయించారు! ఇలాగ తేల్చిన మొత్తాన్ని బట్టిచూస్తే లోగడ కంపెనీ వుద్యోగులకు చెల్లించి వేయబడిన బాకీయావత్తు అబద్దమే ననిన్నీ నిష్కారణంగా ఆ మొత్తం చెల్లించబడిన దనిన్నీ కనబడుతూ వుంది.

ఈ ఋణభారంయొక్క వడ్డీమాత్రమే సాలుకు 623000 సవరసులుగా వుండేది. ఇది తూర్పుఇండియా వర్తకసంఘంవారికి బారత దేశంవల్ల వచ్చేలాభాల మొత్తానికి రెట్టింపు మొత్తంగా వుండడం చూసి చాలా మంది తమ గుండెలు బాదుకొన్నారు. దొంగపత్రాలను సృష్టించి నందుకు కొందరిమీద ఫొర్జరీ కేసులు దాఖలుకాగా వాటి విచారణ సందర్భంలో ఆకాలంలో చెన్నపట్నంలో కంపెనీ అధికారులుగాను, స్వతంత్రవర్తకులుగాను, ఉండిన దొరలు చేసిన అనేక అక్రమాలూ, అన్యాయాలూ బయలుపడినవి. ఆంధ్రపత్రిక వృషభసంవత్సరాది సంచికలో 'మన చెన్నపట్నము - దీని పూర్వచరిత్ర ' అనే వ్యాసంలో దీని వివరము లున్నవి.(Rule and fulfillment of British Rule in India Thompson, and Garrett pp 187-190)

తంజావూరు రాజ్యాపహరణం

  అప్పులు తీర్చలేక ఖర్చులకు సొమ్ము చాలక బాధ పడుతూ