చెన్నపట్నం గవర్నరు దుర్గతి
95
దీశారు. నవాబుగారి బాకీల విషయమై చర్చ వచ్చినప్పుడల్లా ఈపక్షంవారు రేచులలాగ లేచి ఆ వ్యవహారాలను సమర్దించేవారు.
ఈవిషయంలో ప్రవేశించి చాలా దుర్మార్గాలుచేసి సొమ్ము కాజేశాడనే కారణం వల్ల చెన్నపట్నంలో కంపెనీవారి క్రింద ఇంజనీరించు కట్టడముల శాఖలో పని చేసే పాల్ బెన్ ఫీల్డ్ అనే ఒక చిన్న కంపెనీ ఉద్యోగిని ఇక్కడ అధికారులు 1770 లోనూ 1778 లోనూ రెండుసార్లు పనిలోనుంచి తొలగిస్తే అతడు సీమకు వెళ్లి అక్కడ తన పలుకుబడి నుపయోగించి మళ్ళీ తన వుద్యోగం తాను తెచ్చుకున్నాడు. తరువాత అతడు పార్లమెంటు సభలోప్రవేశించి ఈ అన్యాయాలను నిలబెట్టడానికి పాటుపడి కృతకృత్యుడైనాడు.
ఆర్కాటు నవాబుగారి బాకీలవ్యవహారంవల్ల చెన్నపట్నంలో కంపెనీ ప్రభుత్వం పుచ్చిపోయింది. ఆర్కాటు నవాబుబాకీల విషయంలో జరిగిన అన్యాయాలను గుఱించి విచారించ వలసినదని పార్లమెంటు వారు 1774 లో తీర్మానించారు. ఈ ఋణమును పరిశీలించగా అది మూడు భాగాలుగా కనబడించి. అందులో రెండు భాగాలలో కొంతనిజం వున్నట్టు కనబడినా పెద్దభాగం మాత్రం అంగీకరించడానికి వీలులేని దొంగ బాకీలతో నిండివున్నట్లు కనబడింది కంపెనీ డైరెక్టర్లు దీనిని గుఱించి విచారించడానికి ప్రయత్నిస్తే బోర్డు ఆఫ్ కంట్రోల్ అనే పై తనిఖీ సంఘంవారు దానిని అలాగ విడదీయడానికి వీలు లేదని బాకీల మొత్తాన్ని అంగీకరించడమో,నిరాకరించడమో జరగాలన్నారు. దీనికి కారణంసీమలోని అదికారులలోని అధికారులలోకూడా చాలామంది కిందులో భాగాలు వుండడమే!
ఇంగ్లాండు పార్లమెంటుసభలో సభ్యుడుగా నున్న ఎడ్మండ్ బర్కు అనే ధర్మాత్ముడొకడు ఈయన్యాయాలను చూచి సహించలేక దీనిని గుఱించి అతితీవ్రంగా విమర్శించి ఈ బాకీలను సంబంధించిన కాగితములు నన్నింటినీ పార్లమెంటువారి ఎదుట పెట్టవలసినదని, ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అయితే పైనచెప్పిన పాల్ బెన్