94
కథలు గాథలు
కంపనీవారికి సైనికవ్యయంక్రింద సాలుకి ఏడులక్షల వరహాలచొప్పున చెల్లించవలసిన సొమ్మును నవాబుచెల్లించలేక బకాయి పెట్టి అందుక్రింద 1763లో జాగీరుజిల్లా అని ప్రసిద్దిచెందిన చెంగల్పట్టు జిల్లాను కంపెనీ వారికి సమర్పించాడు. ఐతే మళ్లీ సాలుకి 3 1/2 లక్షలవరహాలను చెల్లించే పద్ధతిని ఆజిల్లాను వారివల్ల 1768 మొదలు 1780 వఱకూ అతడు కవులు పుచ్చుకొంటూ ఆసొమ్ముకూడా చెల్లించలేక బాకీపడినాడు. అంతట 1780 లో కంపెనీవారే ఆజిల్లాలొ శిస్తులు వసూలు చేయడానికి యిజారాలు పాడించి బాకీక్రింద వసూలు చేసుకొనేవారు. ఆబాకీ తీరడం ఆంటూలేదు.
ఇలాగ నవాబుగారు లోకుల కివ్వవలసిన మొత్తం పాపం పెరిగినట్లు పెరిగి, కొన్ని కోట్ల వరహాలు తేలింది. బాకీదారులు తమబాకీలను గుఱించి గోలచెయ్యడం ప్రారంభించారు. ఈబాకీలను తీర్మానించే విషయంలో నవాబు ఉపేక్ష వహిస్తూన్నాడనీ , చెన్నపట్నం కంపెనీ అధికారులు కొందరిపట్ల పక్షపాతబుద్ధి చూపిస్తూన్నారనీ తగాదాలు బైలుదేరినవి. చెన్నపట్నం దొరలలోనే ఈ విషయంలో రెండు పార్టీలు బయలుదేరినవి. ఈ తగాదాలు, కుట్రలు, అక్రమాలూ ఎక్కువయి ఆఖరికి సీమలో కంపెనీ డైరక్టర్లకు ఫిర్యాదులు పోగా వారు దీనిని గుఱించి కొంతవిచారణ చేశారు. వారిలోకూడా కొందఱు ఒకపక్షమూ మఱికొందరు ఇంకొక పక్షమూ అవలంబించి అభిప్రాయభేదాలు కనబర్చగా ఈవిషయం పార్లమెంటులో చర్చకు వచ్చింది. కాని అక్కడ కూడా అభిప్రాయ భేదాలు వచ్చినవి. దీనికంతా కారణం నవాబుగారి జుట్టు చేతచిక్కించుకున్న దొరలే. ఈవిషయంలో సీమలో కూడ కొంతసొమ్ము ఖర్చుపెట్టి అక్కడివారి నోళ్లు కట్టకపోతే నవాబుగారి రాజ్యం ఆయనకు దక్కడం దుర్లభమని చెప్పి ఆయనను భయపెట్టి అతని దగ్గరనుంచి వారు మళ్లీ కొంతసొమ్మును గుంజి, కొందఱు డైరక్టర్లకూ, పార్లమెంటు సభ్యులకూ లంచా లిచ్చిన్నీ ఈ ఋణపత్రాలలో భాగాలిచ్చిన్నీ నవాబుగారి ఋణాలను సమర్ధించేపక్షాన్ని అక్కడ లేవ