పుట:Kasiyatracharitr020670mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాబాదు అనే పేరుగలిగిన యింగ్లీషువారి దండు ఉండే బస్తీకి సమీపముగా నున్న కాకాగూడ మనే బొమ్మదేవరు నాగన్నతోట చావడిలో నుంటిని.

హయిదరాబాదు షహ్రుకుచుట్టు బేగంబజారు అనే బస్తీయొకటి యున్నది. అందులో సాహుకర్ల కొఠీలు కలవు. అది షహరు కంటే వాసయోగ్యము. అక్కడికి కోసెడు దూరములో కారువానా అనే బస్తీ యొకటి యున్నది. అది రత్నాలు వగయిరా అమ్మే వర్తకులుండే స్థలము. ఆ బేగంబజారుకు చేరినట్టు యింగిలీషు రెసైడెంటు వారి ఖర్చుక్రింద విస్తారముగా నున్ను అలంకారముగా నున్ను ఒక హవేలి చుట్టున్ను లోకులున్ను వర్తకులున్ను ఇండ్లు కట్టుకొని యుండుటచేత నొక పెద్ద బస్తీ అయినది. ఆ స్థలము పేరు చంద్రఘాటు అనుచున్నారు.

షహరు లోపల షాలీబండ అనే పేరు కలిగిన యొక పేట యున్నది. ఆ స్థలమందు అక్కడి బ్రాంహ్మణులు ఇండ్లు కట్టుకొని కాపుర మున్నారు. దివాన్ పేష్కారు చందులాలు అక్కడ ఇండ్లు కట్టుకొని కాపురమున్నాడు. నిజాందేవిడి షహర్ నడమనున్నది. అనేకులయిన పెద్దమనుష్యులు, నిజాం వంశస్థులున్ను షహరు నడమ కాపురమున్నారు. షహరునడమ మక్కామజ్జీత్ అనే యొక తురకల్ జపశాల యున్నది. దాని స్థూపీలు రెండు మొలాము చేయబడి యున్నవి గనుక బహుదూరానికి తెలియుచున్నవి. మశీదుకు నెదురుగా లోగడి దివాన్ మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతుగా నున్నవి. వాటికి సమీపముగా చౌకు అనే పేరుగల గుజిరీ అంగడి యొకటిన్ని, బట్టల యంగళ్ళు, పాత్రసామానుల యంగళ్ళున్ను ఉన్నవి. నాల్గు దోవలు చేరడానకు గాను కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు దానాకు కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు గలిగిన యొక చావడిన్ని యున్నది. షహరులో రాజవీధులయందు గుండురాళ్ళు పరచియున్నవి. అట్టి వీధులలోనుండే కశ్మలమయిన యడుసులో నడిచేవారి పాదాలు పూడిపోవుచున్నవి. ఇండ్ల యలంకార