పుట:Kasiyatracharitr020670mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసిద్దమయిన దేవస్థలము. ఆ మనోజీపేటకు సమీపాన నీడ గల యొక తోపు సుందరుముగా నున్నది. అక్కడికి సమీపముగానే బంగారురంగు అనే పేరు కలిగిన యొక సోగసయిన గుండు ఒక తిప్ప కొన యందున్నది. చూపుకు ఆతిప్పగుండు పానపట్ట సహితమయిన లింగాకారముగా నగుపడుచున్నది. ఆ మనోజిపేట మొదలుగా గణపురము వరకు కొండలనడుమ భాట పోయినా రాళ్ళు లేవు. అది గులక యిసక పొరగా నున్నది. ఆ గణపురము జాగీరు గ్రామము. కొండకింది యూరు, కొండమీద దుర్గము, కోట, మజుబూతి(గట్టి)గా కట్టి యున్నది. బస్తీగ్రామము. 20-30 బ్రాహ్మణులయిండ్లునా చిన్నవి గనుక స్థలము దొరకడము ప్రయాస. చావిళ్ళున్నవి. అన్ని పదార్దాలు దొరకును గాని నీళ్ళకు బహుప్రయాస. బావులు లోతుగా నుండడమే గాక జలము ఉప్పుగా నున్నది. మంచినీళ్ళు బహు దూరముగా వెళ్ళి తెచ్చుకొనవలసినది. ఆ రాత్రి అక్కడ నిలచినాను.

27 తేది ఉదయాన 4 ఘంటలకుప్రయాణమై 11 ఘంటలకు 3 కోసుల దూరములో నుండే జడచర్ల అనే యూరు చేరి నాను. దారి యిసుకపొర. ఆ నడమ మూలకర్ర, కోటూరు, ఆలూరు అనే గ్రామాలు న్నవి. ఆలూరివరకు అడివినడమ భాట. ఆలూరుమొదలుకొని అడివిలేదు. దారిలో జలసమృద్ది గల బావులు, చెరువులు న్నున్నవి. పరిపొలాలు పొలకట్లు తీర్చియున్నవి.

కృష్ణానది దాటినదిమొదలు శెషాచలపర్వతము అదృశ్వమయినా అడుగడుగుకు చిన్న చిన్న పర్వతాలున్నవి. సృష్టిచేసిన పరమాత్ముడు ఆ కొండలు రాతిమీద రాయిని అతికియుంచినట్టుగా నొక కొండమీద నొక బండ యిమడక దొర్లునని తొచిన తావులలో పలకవంటి రాళ్ళను కొల్లేరులో చెక్కి చక్కచేసినట్టు ఉంచి యిమిడిచి యున్నవది. ఆ కొండల సమూహములను జూడగా భూమిని మొక్కాలు వాశి పర్వతమయముగా భగవంతుడు చేసినట్లు తోచుచున్నది. అన్ని పర్వతములను సృష్టించ డానికి ముఖ్యకారణ మేమని యోచించగా నీ భూగోళము ఉదకబుద్బుదము గనుక భూమిని