పుట:Kasiyatracharitr020670mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మయిన కోట యొకటి కలిగియున్నది. అక్కడి గుళ్ళలో తంబలవాండ్లు అర్చకులుగా నున్నారు. కావలిసినవారు తామే పూజ చేయవచ్చును. ఆ యూరున్ను కందనూరు నవాబుతో చేరినది. ఆ కృష్ణ దాటడానికి మనిషికి ఇంతమాత్రమని హాశ్శీలు పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలానకు వెళ్ళేటందుకు నేను శూద్ర మనిషికి 1 కి ర్పూ 3 1/2 గుర్రనికి ర్పూ 3 1/2 అభిషేకానికి ర్పూ 1/2 బ్ర్రాహ్మణునికి అ 2, లెక్కనిచ్చినాను. కృష్ణ అక్కడ దాటవలసినది గనుక అక్కడ ఘాటు హాశ్శీలు ఒక పక్క కందనూరు నవాబుకున్ను ఒక్కప్రక్క హయిదరాబాదు వారికిన్ని యివావలసి యున్నది. ఆకృష్ణ యీవలి గట్టువరకు కందనూరి నవారియొక్క దొరతనమునకు లోబడిని దేశము. ఆవలిగట్టు మొదలు చేసుకొని హైదరాబాదు వారి రాజ్యము. తిరుపతి మొదలు ఆ యూరివరకు ప్రతి గ్రామమున కున్ను ఒక రెడ్డిన్నీ, ఒక కరణమున్ను ఉన్నారు. ఆ కరణాలు కొందరు నందవరీశులు, కొందరు ప్రధమ శాఖలు, కొందరు నియోగులు. ఈరీతిగా బ్ర్రాహ్మణులు ఆ యుద్యోగమును చూచుచున్నారు. కట్టుబడి బంట్రోతులని జీతానికి బదులుగా భూమిని అనుభవింపుచు కావలి కాచుకొని గ్రామాదుల సకల పని పాటలున్ను చూచున్నారు. పరువు కలిగిన ముసాఫరులకు కావలసిన సరంజామా సహాయసంపత్తు ఆ రెడ్డి కరణాలగుండా కావలసినది. ఆ యుద్యోగస్థుల నిద్దరినిన్ని నయభయముల చేత స్వాధీన పరచుకొంటేగాని మార్గవశముగా వచ్చే పరువుగల వారికి పనులుసాగవు. పరువుగలిగిన ముసాఫర్లు అధికారపు చిన్నెకొంత వహించితేనే బాగు. నిండాసాత్విక గుణము పనికిరాదు. మార్గము చూపించడమూకున్ను దిగిన తావున కావలసిన సామానులు తెప్పించి యివ్వడమునకున్ను రెడ్డి కరణాల యొక్క ఉత్తరవు ప్రకారము ఆ కట్టుబడి బంట్రోతులు పనికి వచ్చుచున్నారు. ఓంకార మనే స్థలమందలి తీర్ధములో నున్న జలమందు మునిగి క్షణమాత్రము తల యెత్తక నిలిపియుంటే ఓంకార నాదము వినిపింపుచున్నది. ఆనివృత్తిసంగమమునకు నేను వచ్చిన భాటలో అక్కడకు ఆమడ దూరములో ముసలిమడుగు అని యొక యూ