పుట:Kasiyatracharitr020670mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వూట స్రవించి తీర్ధములము అంతర్వాహినిగా పారివచ్చి అవతల సాగి పోవుచున్నది. ప్రతి తీర్ధమునకున్ను సూర్యరశ్మి పడకుండా పైన మంటపాలు కట్టియున్నవి. ఏ తీర్ధమున్ను మోకాటిలోతుకు నెక్కువలేదు. రోగకారియని అక్కడివారు చెప్పినారు. ఉదకము నిర్మలముగా నున్ను, శీతళముగా నున్నది. ఆగుడిహాశ్శీలు మూలకముగా సంవత్సరము ఒకటికి 15000 కందనూరు నవాబుకు వచ్చినా, గుడి యేగతి పొందేదిన్ని విచారింపడు. ఏరయినా మరమ్మతు చేసినట్టయితే సెలమత హాశ్శీలు తీసుకొనుచున్నాడు. రాజా చందలాలా ఈనిర్బంధము చేత కొంత మరమ్మతుచేసి విసికి విడిచి పెట్టినాడు. అతను అర్గురు బ్రాంహ్మణులను నెల 1కి 3 రూపాయీలు జీతముచేసి నిత్యము స్వామికి అభిషేకము చేసేటట్టు వుంచినాడు. మహిషాసుర మర్ధనము మహినూరి దేశములో చేసినందున ఆదేశమునకు మహిసూరనే పేరు వచ్చినదను చున్నారు. అక్కడ మహిషాసుర మర్ధనమయినందున వెనుక భ్రమరాంబ శ్రీశైలము ప్రవేశించినది. మహిసూరు తద్ద్వారా ఆమె పుట్టిన దేశమని ఆ దేశస్థులు ఎవరు వచ్చినా హాశ్శీలు యియ్యనక్కరలేదు. జంగాలకు, ఆరాధ్యులకు, బ్రాంహ్మణులకున్ను ఉత్సవ కాలములో హాశ్శీలు లేదు. గుడిలో నే పక్క చూచినా అడివి ములిచి సర్ప వ్యాఘ్ర భూయిష్తముగా నున్నది. ఆ యడవి కొట్టి చక్కచేసే దిక్కులేదు. స్వామికిన్ని, దేవికిన్ని ఎవరయినా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించిరేని వాటిమదింవంత రూకలు హాశ్శీలు పుచ్చుకోనడము మాత్రమే కాకుండా కొన్ని దినములు పోనిచ్చి ఆ వస్తువులే ఆ కందనూరి నవాబు అపహరించు చున్నాడు. తిరుపతి విషయముగా కుంఫిణీవారిని "అహో గుణవతీ భార్యా భాండమూల్యం న యాచతే" అనే శ్లోకసంగతి ప్రకారము ఆ స్థలవర్తమానము తెలిసినవారు కొనియాడవలసియున్నది. కలి సామ్రాజ్యము గనుక లోకక్రమం సాక్షిగా నుండే యీశ్వరుడు లోకులకు కర్మఫలప్రదానము చేయుట కంటె ఎక్కువ యేమి చేయగలడు? ఇది నర్మజనపూజిత మయిన ప్రసిద్ధి కొనిన స్థలము. శిఖరదర్శన మాత్రము చేతనే జన్మాదులు లేవని పురా