పుట:Kasiyatracharitr020670mbp.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పోయినా దోవ రాతిగొట్టుగాను న్నిరుపక్కల దట్టమయిన అడివిగాను నున్నది. సవారీలు వస్తే చెట్లకొమ్మలు వాటికి తగులును. ఆరాతిగొట్టు దారిని దాటిన వెనుక పెద్ద చెరువుదాకా గుర్రపుబండ్లు పొయ్యే పాటిగా, భాట విశాలముగా సమముగా నున్నది. పెద్ద చెర్వునుంచి పచ్చేటప్పుడు రెండుమూడు భాటలు చీలిపోవు చున్నవి. తెలిసిన చెంచుగాండ్లను పిలుచుకొని నాగులోటె చేరవలసినదిగాని స్వతంత్రముగా బోనే తప్పిపోదురు. కుడిచేతి పక్క చీలే భాటలు వదిలి యెడమ చేతిపక్కభాటను పట్టి వస్తే నాగులోటికి రావచ్చును. ఆ పెద్దచెరువు విడిచి శ్రీశైలము చేరేవరకు గాని నాగులోటి వదిలినది, మొదలుచేసుకొనిగాని యెక్కడనున్ను ఆవరణ సంబంధమయిన నీడయున్ను, జలవసతి గల ప్రదేశమున్నులేవు. ఆపెద్దచెర్వు అనే యూరిలో పందులు తోలను చాలేపాటి 20 కిరాతకుల గుడిశలున్నవి. మరి వేరేనీడలేదు. చెరుఫులో రమణియ్యమయిన రామరస పుష్పాలుగల జలము కలిగి యున్నది. చెన్నపట్టణపు కొణ్నూరు నీళ్ళు వదిలిన వెనక నింశపాటి యుదకము నేను చూచినవాడను గాను. అందరున్ను ఆ చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని వానవచ్చునేని ఆ గుడిశలలో కూర్చుండి యుండవలసినది. ఆయూరి చెంచు బోయీలనే కిరాతకులకు నొకడు యజమానుడుగా నాయకుడనే బిరుదు వహించియున్నాడు. వాడు ధర్మ్మాత్ముడు. పరషవారివద్ద నవాబు సరకారుయొక్క ఆజ్ఞప్రకారము మనిషికె 3 డబ్బులవంతున హాశ్శీలు తీసుకొన్నా పస్తుగా నుండేవానికి బియ్యమిచ్చి పాత్ర యిచ్చి వంటచేసుకొనుమని ఉపచరింపుచున్నాడు. ఆమార్గముగా శ్రీశైలమునకు వెళ్ళేవారికి పొయ్యేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ నిస్సందేహముగా విధిలేక మజిలీ చేయవలసి యున్నది. నేను తిరుగుదలై పచ్చేటప్పుడు పదిరూపాయీల్లో నొక చావిడి విశాలముగా కట్టవచ్చునని ఆనాయకుడు మొదలైన వారిగుండా తెలుసు కోంటిని. అక్కడి వాడిక ప్రకారము వెదురు తడికలతో గోడలుపెట్టడము వలన నన్ను, అడివి వెదురు మయంబు నందుననున్న ; అక్కడి వెదురు తడికెలు మట్టి